గత కొన్ని రోజులుగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పై మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలోని ఒక కాఫీ షాపుకు తరుచు మోక్షజ్ఞ వస్తూ ఉంటాడనీ అయితే అక్కడ ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాంతంగా ఆ కాఫీ షాపులో కూర్చుని వెళ్ళిపోతాడని అనేక వార్తలు వచ్చాయి. 

ఈవార్తలను బాలయ్య కుటుంబం ఖండించకపోవడంతో అసలు మోక్షజ్ఞ అంత ఏకాంతంగా ఒక కాఫీ షాపులో స్నేహితులు కూడ లేకుండా ఎందుకు కాలం గడుపుతున్నాడు అంటూ బాలయ్య అభిమానంలు కూడ గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో మోక్షజ్ఞ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక కారులో ఒక్కడు ఏకాంతంగా ప్రయాణిస్తున్న ఫోటోను ఒక అజ్ఞాత వ్యక్తి తీసి లీక్ చేసాడు. 

వార్తలలో వచ్చిన విధంగానే మోక్షజ్ఞ ఈ లేటెస్ట్ ఫోటోలో కొద్దిగా లావుగా కనిపిస్తూ కొంచం మూడీగా కనిపిస్తున్నాడు. ఆ ఫోటో తీస్తున్న వ్యక్తి వైపు చూస్తూ అభివాదం చేయడం కూడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లేటెస్ట్ ఫోటో పట్టి మోక్షజ్ఞ తన ఫిజిక్ విషయంలో పెద్దగా శ్రద్ధ పట్టడం లేదు అన్న విషయం క్లారిటీ వచ్చినా మోక్షజ్ఞ రూపు మటుకు చాల అందంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం మోక్షజ్ఞ సినిమాలలోకి రావడం కన్నా ఒక బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అవ్వాలని ఉన్న తన కోరికను ఇప్పటికే మోక్షజ్ఞ బాలయ్యకు తెలియచేసినట్లు తెలుస్తోంది. దీనితో బాలయ్య కూడ తన కొడుకుకు ఇష్టం లేని యాక్టింగ్ ను బలవంతంగా అతడి పై రుద్దను అనీ ఇప్పటికే బాలయ్య తన సన్నిహితులతో అంటున్నట్లు సమాచారం. దీనితో తాము కోరుకున్న బాలయ్య వారసుడు ఎంట్రీ ఇక ఉండదా అంటూ బాలయ్య అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: