కొంగర జగ్గయ్య... బహుముఖ ప్రాజ్ఞాశాలి.  అనేక సినిమాల్లో నటించిన వ్యక్తి.  జగ్గయ్య వాయిస్ ఆయనకు బలాన్ని చేకూర్చింది.  సినిమా అవకాశాలను తీసుకొచ్చింది.  అప్పట్లో మూడు షిఫ్ట్ లో పనిచేసేవారు. 

ఒకసారి ఆయన ఒప్పుకొన్న చిత్రాల షూటింగ్‌లన్నీ పూర్తవడంతో విరామం దొరికింది. అప్పటికే అలసిపోయిన జగ్గయ్య తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్లకి ఇలా చెప్పారట.

‘‘నేను ఈ తెల్లవారుజామున వచ్చాను. పడుకొని నిద్రపోతాను. నన్ను ఎవరూ లేపకండి. తలుపు దగ్గరగా వెయ్యండి. అప్పుడప్పుడూ వచ్చి చూస్తూ ఉండండి. నేను లేవకపోతే, భోజనానికనీ, టిఫిన్‌కనీ లేపొద్దు. నేనే లేచి వచ్చి తింటాను’’ అని పడుకొని నిద్రపోయారు. 

అలా చెప్పిన జగ్గయ్య రెండు రాత్రులు, రెండు పగళ్లూ నిద్రపోయారు. మధ్యలో దేనికీ లేవలేదట. ఆ తర్వాత డాక్టర్‌ వద్దకు వెళ్తే, ‘48గంటలపై చిలుకు అతి గాఢంగా నిద్రపోవడమన్నది నేనెక్కడా వినలేదు. ఆ విశ్రాంతి మంచిదే’ అని ఆయనను పరీక్షించిన డాక్టర్.  ఇలా ఎన్నోసార్లు జగ్గయ్య విశ్రాంతి లేకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి.  అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: