ప్రియాంక జవల్కర్ అచ్చమైన తెలుగు అందం. చేసింది రెండు సినిమాలు. అయినా అనుకున్న హైప్ రాలేదు. కొత్త ఆఫర్లు తన్నుకుంటూ అంతకంటే రాలేదు. మన అనంతపూర్ కి చెందిన ఈ అమ్మాయి ఇపుడు కొత్త రూట్లో వెళ్తోంది. తెలుగు తెరపై వెలిగిపోయేందుకు కసిగా క్రుషి చేస్తోంది.


నా దగ్గర అందం ఉంది. పందెం కాయండంటూ సోషల్ మీడియా వేదికగా తన సెక్సీ పిక్స్ తో ప్రియాంక ఇపుడు రెచ్చగొడుతోంది. విజయ దేవరకొండతో చేసిన టాక్సీ వాలా మూవీలో గ్లామర్ తెగ ఒలకబోసిన ఈ అమ్మడుకు మళ్ళీ ఆఫర్ ఏదీ తలుపు తట్టలేదు. దాంతో మడి తడి అంటూ కూర్చోకుండా మరింతగా బోల్డ్  అయిపోతూ ఇన్స్ట్రాగ్రాం లో ఫోటోలను పెట్టి కవ్విస్తోంది.


 చేసింది రెండే రెండు సినిమాలైనా అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది ప్రియాంక. అయినా తెలుగమ్మాయి కదా పాపం! అందరికీ జరిగేదే ఆమెకూ జరిగింది. దర్శకనిర్మాతలు ఆమె ఉందనే విషయాన్నే మరిచారు. దీంతో ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో అందాల ఆరబోత కూడా మొదలెట్టింది ప్రియాంక. మరి చూడాలి ఆఫర్ల వెల్లువ ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: