నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును నిన్న తన బసవతారకం కేన్సర్ సెంటర్ లో అతి నిరాడంబరంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ కేక్ కోసి మాట్లాడుతూ తనకు వయస్సు పెరిగింది అని అనిపించు కోవడం తనకు ఇష్టం ఉండదనీ అంటూ తాను జీవించి ఉన్నంతకాలం సినిమాలలో నటిస్తూనే ఉంటాను అన్న సంకేతాలు ఇచ్చాడు. 

అయితే నిన్నటి రోజున ఘనంగా ప్రారంభం అవుతుంది అని భావించిన బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభోత్సవం నిన్న కాకుండా ఈనెల 13వ తారీఖుకు వాయిదా పడటం వెనుక బాలకృష్ణకు ముహూర్తాల పై ఉన్న సెంటిమెంట్ కారణం అని అంటున్నారు. అయితే అభిమానులకు జోష్ ను కలిగించడానికి బాలయ్య కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక లీకులు ఇచ్చారు. 

ఇప్పటి వరకు ఈసినిమాకు టైటిల్ గా ప్రచారంలో ఉన్న ‘రూలర్’ టైటిల్ ను మార్చి ‘క్రాంతి’ అన్న టైటిల్ ను నిన్న రిజిస్టర్ చేసినట్లు టాక్. కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండే క్రాంతి పదం కమ్యూనిస్టులు అందరికీ చాల ఇష్టమైన పదం. ఇప్పుడు ఆ పదాన్ని బాలయ్య తన సినిమాకు టైటిల్ గా మార్చుకోవడంతో బాలకృష్ణ పార్టీ మార్చాడా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు.

మారిన రాజకీయ పరిస్థుతులకు అనుగుణంగా ఈమూవీ కథలో చాల మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యవస్థ పై ముఖ్యంగా రాజకీయ నాయకుల పై తిరుగుబాటు చేసే ఒక పోలీసు ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటించబోతున్నాడు. ఈసినిమాను అత్యంత వేగంగా పూర్తి చేసి సంక్రాంతి రేసుకు విడుదల చేయాలి అని బాలకృష్ణ చాల గట్టి పట్టుదల పై ఉన్నట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: