సంక్రాంతికి మరో ఆరు నెలల సమయం ఉంది.  ఏఏ సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి అనే దానిపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది.  ఇప్పటికే మహేష్ బాబు సంక్రాంతి బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నాడు. కాగా ఇప్పుడు మరో రెండు సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి.  

వాటిల్లో ఒకటి బాలకృష్ణ 105 వ సినిమా.  బాలయ్య 105 వ సినిమా ఎవరితో ఉంటుంది అనే దానిపై మొన్నటి వరకు పెద్దగా క్లారిటీ లేదు. బాలకృష్ణ దగ్గర రెండు ఆప్షన్ లు ఉన్నాయి.  ఒకటి కెఎస్ రవికుమార్.. రెండోది బోయపాటి.  బోయపాటి సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో పక్కన పెట్టారు.  

కెఎస్ రవికుమార్ సినిమా ఒకే అనుకున్నా కథలో మార్పుల కారణంగా ఆలస్యం అయ్యింది.  ఏదైతేనేం ఎట్టకేలకు సినిమా జూన్ 12 వ తేదీన ప్రారంభం కాబోతున్నది.  ఈ సినిమాను జనవరి 2020 సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.  

అటు నాగార్జున కూడా తన బంగార్రాజు సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాడు.  అయితే, ఈ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు.  మరో 10 లేదంటే 15 రోజుల్లో ఈ సినిమా గురించి క్లారిటీ వస్తుంది.  సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతున్నది.  మొత్తానికి మహేష్ బాబును బాలకృష్ణ, నాగార్జున రౌండ్ చేస్తున్నారన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: