కబాలి సినిమా గురించి అందరికి తెలుసు.  అందులో రజినీకాంత్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.  సినిమా బాగున్నా కానీ, రజినీకాంత్ చేయాల్సిన సినిమా కాదు.  అందుకే సినిమా యావరేజ్ గా నిలిచింది.  హైప్ కిరియేట్ అయినా సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది.  

ఇందులో రజినీకాంత్ కూతురుగా ధన్సిక చేసింది.  గ్యాంగ్ స్టర్ కూతురుగా ధన్సిక నటన సూపర్ అని చెప్పొచ్చు.  ఆ తరువాత కొన్ని తమిళ సినిమాలు చేసిన ధన్సిక ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫొటోలతో అదరహో అనిపిస్తోంది.  

ఇప్పుడు ఈ హీరోయిన్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ మెరుపులు మెరిపిస్తోంది.  లేటెస్ట్ గా ఈ నటి ఫిట్నెస్ స్ట్రెంగ్త్ చూస్తే మాత్రం మతి పోవాల్సిందే. అమ్మడు చూడడానికి కొంచెం బొద్దుగా కనిపించినా శరీరాన్ని మాత్రం విల్లులా వంచేస్తుంది. కొన్ని రోజుల క్రితం బ్యాక్ ఫ్లిప్ జంప్స్ చేస్తున్న వీడియో ని తన ట్విట్టర్ అకౌంట్ లో

పోస్ట్ చేసిన ఈమె  ఈరోజు సముద్రం తీరాన యోగా భంగిమల్లో కష్టమైన శీర్షాసనం వేస్తున్న ఫొటో ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. 
తన దిన చర్య ఇలా యోగాతో మొదలౌతుంది ఓ టాగ్ లైన్ కూడా పెట్టింది. ప్రస్తుతం ధన్సిక సముద్రఖని దర్శకత్వంలో కిత్నా, వాలుజడా అనే సినిమాలు చేస్తోంది.  ఈ రెండు సినిమాలు కూడా టాలీవుడ్ లోకి అనువాదం కాబోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: