మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న క్రమంలో చివరిగా ఇటీవల తాను నటించిన చిత్రలహరి సినిమా మెగా అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో సాయి ధరంతేజ్ చెట్టు కింద ప్లీడర్ ఇలాంటి పాత్రలో నటిస్తున్నట్లు ఫుల్ కామెడీ సినిమా అన్నట్లు ఇండస్ట్రీ నుండి వినబడుతున్న సమాచారం.


ముఖ్యంగా ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా గా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నట్లు అందుకే ఈ సినిమాకి ప్రతి రోజు పండగ అనే సూపర్ టైటిల్ పెట్టినట్లు ఫిలింనగర్ టాక్. ఇకపోతే ఈసారి మారుతీ ఎప్పటిలాగా హీరోకి ఏదో ఒక ఒంక పెట్టకుండా.. ఈసారి హీరోయిన్ పై ట్రై చేస్తున్నాడట.


ఈ సినిమాలో హీరోయిన్ కి మంచి ప్రాధాన్యత ఉండడమే కాదు.. హీరోయిన్ కి గ్లామర్ మాత్రమే కాకుండా ఆ పాత్ర ద్వారా కావాల్సినంత కామెడీని పండించడానికి చూస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కి టిక్ టాక్ వీడియోస్ చేసే అలవాటు ఉంటుందట. ఈ లైన్ తో సాయి ధరంతేజ్ మరియు హీరోయిన్ ల మధ్య చాలా కామెడీ సన్నివేశాలు సినిమాలో ఉండేటట్లు మారుతి స్క్రిప్ట్ లో సీన్స్ రాస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: