జబర్దస్త్‌షో అనగానే ముందుగా జడ్జీలు నాగబాబు, రోజాలు గుర్తుకువస్తారు. స్కిట్లతో వేసే జోకులకు పడీ పడీ నవ్వే నాగబాబు, తన అందంతో, జబర్దస్ టీమ్ మెంబర్స్‌పై పంచ్‌లతో రోజా ప్రేక్షకులను ఆకటట్టుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నగరి నుంచి పోటీ చేసిన రోజా జబర్దస్‌ షోకు విరామం ఇచ్చారు. అయితే ఎన్నికల్లో రోజా మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి అయితే జబర్దస్త్‌కు రోజా పర్మినెంట్‌గా గుడ్‌బై చెబుతుంది అనుకున్నారు. కానీ జగన్ కేబినెట్‌లో రోజాకు ఛాన్స్ దొరకలేదు.

అయితే సీఎం జగన్ మాత్రం రోజాకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. అయితే రోజా ప్రస్తుతం ఎన్నికల ఫలితాల తర్వాత జబర్దస్త్ షోలో పార్టిస్పేట్ చేస్తున్నా, ముందు ముందు కంటిన్యూ చేస్తుందో లేదో తెలియదు. ఇక మరో జడ్డి మెగా బద్రర్ నాగబాబు  తమ్ముడు పవన్ కల్యాణ్‌కు తోడుగా జనసేన పార్టీలో చేరి నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. జనసేన ఘోర పరాజయం అవడంతో మెగా బ్రదర్స్ సైలెంట్ అయిపోయారు. రాజకీయంగా భవిష్యత్తు కనిపించకపోవడంతో నాగబాబు మళ్లీ జబర్దస్త్ షోకు రీ ఎంట్రీ ఇచ్చాడు.


తాజాగా జూన్ 13 న గురువారం టెలికాస్ట్ అయ్యే జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమోలో రోజాతోపాటు జడ్డిగా నాగబాబు కనిపించారు. సో..నాగబాబు మళ్లీ జబర్దస్త్‌కు రీఎంట్రీ ఇచ్చినట్లయింది. ఈ ఎపిసోడ్‌లో ఆది స్కిట్‌లో గెస్ట్‌గా వచ్చిన యాంకర్ శ్రీముఖి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అయితే నాగబాబు, రోజాలు చాలా రోజుల తర్వాత జబర్దస్త్ షోలో కనిపిస్తుండడంతో మళ్లీ కాస్త కళ వచ్చినట్లు ఉంది. నాగబాబు లేకపోవడంతో ఆ మధ్య శేఖ‌ర్ మాస్టర్, జానీ మాస్టర్‌లు జడ్జీలుగా చేసిన ఎపిసోడ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత మీనా, సంఘవి‌లు నాగబాబు ప్లేస్‌లో రోజాతో పాటు జడ్జీలుగా కనిపించారు.

ఎవరు చేసినా, నాగబాబు, రోజా కాంబినేషన్‌లో జబర్దస్త్‌కు ఉన్న క్రేజ్ రాలేదు..అందుకే జబర్దస్త్ నిర్వాహకులు  కూడా నాగబాబు మళ్లీ తమ షోకు రావాలనుకున్నారు. పనిలో పనిగా రాజకీయంగా పని లేకపోవడంతో నాగబాబు కూడా మళ్లీ జబర్దస్త్‌కు రీ ఎంట్రీ ఇచ్చారు. సో..నాగబాబు, రోజాలు మళ్లీ బ్యాక్ అవడంతో జబర్దస్త్ ఆర్టిస్టుల్లో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. మొత్తంగా నాగబాబు జబర్దస్త్‌ షోకు రీ ఎంట్రీ ఇవ్వడంతో చివరకు షోలు చేసుకుంటూ బతకడమే అంటూ నెట్‌జన్లు సెటైర్లు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: