వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో  శ్రీ విష్ణు హీరోగా నివేదా థామస్, నివేత పేతురాజ్  హీరోయిన్లుగా రాబోతున్న సినిమా  'బ్రోచేవారెవరురా'.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. కామెడీ కాన్సెప్ట్ తో రానున్న ఈ మూవీ ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం  పోస్టర్ విడుదల చేస్తూ.. అధికారికంగా ప్రకటించింది. 


ఈ చిత్రంలో నివేదా థామస్  క్లాసికల్ డ్యాన్సర్ గా నటిస్తుంది.  ఇక ఫస్ట్  సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని కూడా బాగా  తెరకెక్కిస్తున్నడాట.  వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో   ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మన్యం క్రీయేషన్స్ పతాకం ఫై మన్యం విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: