తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున ‘సామ్రాట్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదటి చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా..సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలొ వచ్చిన ‘శివ’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఆ తర్వాత నాగార్జున మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  తర్వాత రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాలు, ఫ్యామిలీ తరహా చిత్రాల్లో నటించి కింగ్ నాగార్జున గా పేరు తెచ్చుకున్నారు. 


అయితే శివ చిత్రంలో నటించిన తన సహనటి అమలను రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగార్జున.  అక్కినేని నాగార్జున, అమల 1992, జూన్ 11న వివాహం చేసుకున్నారు. నేడు పెళ్లి రోజు సందర్బంగా ఫ్యాన్స్ వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


తాజాగా దీనిపై స్పందించిన అమల.. ‘నా ప్రేమ,  సర్వస్వం అయిన అక్కినేని నాగార్జునకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నాకు వస్తున్న అభినందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నా. అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు’ అని అమల ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: