కిక్ అనగానే రవితేజ గుర్తుకు వస్తాడు.  ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్టైంది.  రవితేజ తన మాస్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.  తనకు నచ్చని పనిని అస్సలు చేయడు.  కిక్ ఇచ్చే పనికోసం ఎంత దూరమైనా పరుగులు తీస్తాడు.  ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధం అవుతాడు.  


అలాంటి కిక్ సినిమాకు తెలుగులో కిక్ 2 వచ్చింది.  కిక్ ఇచ్చిన కిక్, కిక్ 2 లో కనిపించలేదు.  సినిమా యావరేజ్ గా నిలిచింది.  కిక్ సినిమాను బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చేశాడు. అక్కడ కూడా సూపర్ హిట్టైంది.  బాలీవుడ్ లో హిట్ సినిమాలకు సీక్వెల్ చేయడం సహజం.  


కిక్ సినిమాకు సాజిద్ నడియావాలా దర్శకత్వం వహించారు.  ఇదిలా ఉంటె కిక్ 2 సినిమాకు దర్శకుడు ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది.  కిక్ 2 సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది.  


రోహిత్ శెట్టి దీనిపై క్లారిటీ ఇచ్చాడు.  తాను కిక్ 2 సినిమాకు దర్శకత్వం వహించడం లేదని స్పష్టం చేశారు.  దీంతో ఇప్పుడు ఎవరు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: