యువరత్న నందమూరి బాలకృష్ణ గత నాలుగు సంవత్సరాలుగా చకచకా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. బాల‌య్య కెరీర్‌లో వందో సినిమాగా తెర‌కెక్కిన‌ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేశారు. శాతకర్ణి హిట్ ఇచ్చిన ఉత్సాహంతో పైసా వసూల్, జై సింహ, రెండు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల్లో నటించిన బాలయ్య తాజాగా హిందూపురం నుంచి వరుసగా రెండోసారి కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు మ‌ళ్లీ వ‌రుస‌గా సినిమాల‌ను లైన్లో పెడుతున్నారు.


బాలయ్య ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఒక‌టి కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కెఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఒకటి అయితే... రెండోది మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేసేది. ఈ రెండు సినిమాల్లో ముందుగా కెఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించే ఈ సినిమా ఈ నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు ' క్రాంతి ' అనే క్లాసిక్ టైటిల్ దర్శకుడు రవికుమార్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.


వాస్తవానికి ఇంతకుముందే రూలర్ అనే పవర్ ఫుల్ టైటిల్ అయితే ఈ కథకు కరెక్ట్ గా సెట్ అవుతుందన్న ప్రచారం బయటికి వచ్చింది. ఈ టైటిల్‌ను క‌ళ్యాణ్ ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయడంతో ఈ సినిమాకు ఈ టైటిల్ ఫైనల్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ' క్రాంతి ' అనే టైటిల్ పెట్టేందుకే దర్శకుడు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో నాగార్జున హీరోగా శాంతి - క్రాంతి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాలో క్రాంతి టైటిల్ తో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాలయ్య గతంలో నటించిన హిట్ సినిమా లక్ష్మీ నరసింహ సినిమాలోని  పోలీస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో... క్రాంతి సినిమాలో కూడా బాలయ్య అదే తరహా క్యారెక్టర్‌ను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: