నందమూరి కళ్యాణ్ రామ్ ముందునుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు కథల ఎంపిక విషయంలోనూ ఎంతో వైవిధ్యం చూపిస్తున్నాడు. ఇక ఎక్స్‌పరిమెంట్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలి. కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తే మాత్రం ఆ కథను డైరెక్టర్‌ను అసలు వదిలిపెట్టడు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది అనిపిస్తే ఆ కథతో వచ్చేస్తున్నాడు. ఒక వైపు తన తమ్ముడు తారక్ తో సినిమాలు నిర్మిస్తూనే తను హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన 118 డిఫ్రెంట్ మూవీగా పేరు తెచ్చుకొని కమ్ర్షియల్ సక్సస్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.


ఎఫ్ 2తో హనీ ఈజ్ ద బెస్ట్ అనిపించుకున్న మెహరీన్ కూడా చాలా సెలక్టివ్ గా సినిమాలు ఓకె చేస్తోంది. పంజాబీ సినిమా చేస్తూనే తెలుగులో రెండు సినిమాలు ఓకె చేసింది. అందులో ఒకటి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పక్కన కావడం విశేషం. ఇక 118 సక్సెస్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమాకు మెహరీన్ ను నాయికగా తీసుకున్నారు. ఈ సినిమాను శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి ఫ్యామిలీ సినిమాల డైరక్టర్ సతీష్ వేగెశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోంది. సతీష్ బలం ఫ్యామిలీ సినిమాలే. అయితే కళ్యాణ్ రామ్ కోసం ఆయన ఫ్యామిలీ సబ్జెక్ట్ లోనే కొద్దిగా యాక్షన్ టచ్ తో స్క్రిప్ట్ తయారుచేసినట్లు లేటెస్ట్ న్యూస్.

అంతేకాదు శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ కాబట్టి ఈ సారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని ప్లాన్ లో సతీష్ ఉన్నాడు. సతీష్ సినిమాల్లో హీరోయిన్లకు కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ సినిమాలో కూడా కాస్త ప్రియారిటీ వున్న హీరోయిన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడని, ఆ క్యారెక్టర్ కి  పర్ఫెక్ట్‌గా సూటవుతుందని.. మెహరీన్ ను ఎంపిక చేసారని సమాచారం. మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 లాంటి హిట్ లు మెహరీన్ ఖాతాలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ఒక సినిమాకు తేజు పక్కన హీరోయిన్‌గా అనుకున్నారని కానీ తేజు మెహరీన్ అసలు వద్దంటే వద్దన్నాడని వార్తలు వచ్చాయి. మరి అదే మెహరీన్ కు కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇవ్వడం ఆసక్తికరం.


మరింత సమాచారం తెలుసుకోండి: