ఇటీవల చేనేత కార్యికుల వెతల పై తీసిని మల్లేశం సినిమాను పాత్రికేయులు, కవులు,రచయితలు ,కళాకారులు వీక్షించి చిత్రయూనిట్‌ని అభినందించారు.
 ప్రముఖ కవయిత్రి మెర్సీమార్గరెట్‌ ఆ సిన్మాను చూని తన ఫీలింగ్స్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు .
చదవండి 

'' మల్లేశం సినిమా చూసొచ్చా. తల్లి అసు పోస్తుంటే ఆమె బాధను శ్రమను చూల్లేక అసు యంత్రాన్ని కనుక్కున్న మల్లేశం గారి జీవితాన్ని అధ్బుతంగా తెరకెక్కిస్తే చూసొచ్చాను. మాట్లాడడానికి నోటి వెంట మాటలేదు. అన్నీ చక్కగా కుదిరాయి. ఇరాన్‌ సినిమాలు.. కొరియన్‌ సినిమాలు చూసినపుడు అనుకునేదాన్నీ .. వీళ్లు వాళ్ల జీవితాల్ని వెండితెర మీద చాలా బాగ ఆవిష్కరించుకుంటారనీ.. మన తెలుగు సినిమాల్లో అలా జీవితాల్ని జీవనవిధానాన్నీ ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు చూపించరని. ఇపుడా అభియోగం మల్లేశం సినిమాతో తీరిపోయింది.

ఎంతో సహజాతి సహజంగా ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడా అతి లేకుండా ఒక సామాన్యుడు అసమాన్యుడుగా ఎలా మారాడో అధ్బుతంగా చిత్రీకరించారు. భాషవిషయంలో ..కాస్ట్యూమ్స్‌ విషయంలో.. నటన సంగీతం విషయంలో ఎక్కడా అసంతప్తి కలగలేదు. మల్లేశం అచ్చంగా తెలంగాణ సినిమా. తెలంగాణ పల్లెల్లో ఉండే ఆప్యాయత.. నేత కులవ త్తులు గల నేతన్నల కుటుంబాల బాధలు.. మగ్గాలు మూలకు వదిలేసి పట్టణాలకు వలసపోయిన కుటుంబాల వ్యధ..

 తల్లి కోసం కొడుకు పడే తపన..భర్తకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ.. భర్త కలని తనదిగా చేసుకుని నడిచే భార్య.. అవమానం పొందినచోటే నిలిచి గెలవాలనుకునే ఆరాటం.. తోడు విడువని నేస్తాలు.. ఇలా ప్రతి సన్నివేశం పాత్రద్వారా హదయం మెలిపెట్టేలా ఉంది సినిమా.. !!


మరింత సమాచారం తెలుసుకోండి: