Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 7:23 am IST

Menu &Sections

Search

విల‌క్ష‌ణ న‌టి సూర్య‌కాంతం

విల‌క్ష‌ణ న‌టి సూర్య‌కాంతం
విల‌క్ష‌ణ న‌టి సూర్య‌కాంతం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చ‌ల‌న‌చిత్రాల ప్ర‌ధాన ఉద్దేశ్యం ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందించ‌డ‌మే, అన్న సూత్రంతోనే, చిత్ర నిర్మాణం ఆరంభ‌మ‌యింది. ఆ వినోదంలో ముఖ్య‌మైన‌ది హాస్య‌ర‌సం. ఏ భాష ప్రేక్ష‌కుల‌యిన ఆనందించే హాస్య పాత్ర‌ల‌ను ప్ర‌తిభావంతంగా పోషించే, హాస్య‌న‌టీన‌టులు, అన్ని భాష‌ల చిత్రాల‌లోనూ ఉన్నారు. 
 ఇక మ‌న తెలుగు చిత్రాల్లోని హాస్య న‌టీమ‌ణిగా ప్ర‌ధ‌మ స్థానంలో చెప్పుకోవాల‌సిన న‌టీమ‌ణి శ్రీ‌మ‌తి సూర్య‌కాంతం. అదేంటి సూర్య‌కాంతం అంటే గ‌య్యాళి పాత్ర‌ల‌కు పెట్టింది పేరు అనుకోవ‌ద్దు.


కాని దాదాపు 500 చిత్రాల్లో ఎక్కువ‌గా సూర్య‌కాంతం పాత్ర‌లు, గ‌య్యాళి పాత్ర‌లే అయినా, గ‌డుసుద‌నం, అమాయ‌క‌త్వం, ఉన్న పాత్ర‌లో్లోనూ చ‌క్క‌ని హాస్య‌న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించ‌డం ఆవిడ‌కే చెల్లింది అంటే అతిశ‌యోక్తి కాదు. ఆ పాత్ర‌ల్లో ప్రేక్ష‌కులు సూర్య‌కాంతాన్ని ఆద‌రించ‌డం, అభిమానించ‌డం ఆమె ఉత్త‌మ న‌ట‌న‌కు నిద‌ర్శ‌నం, అదే శ్రీ‌మ‌తి సూర్య‌కాంతంలోని ప్ర‌త్యేకం. 


1950 ద‌శ‌కంలో నార‌ద‌నార‌ది నాచిత్రంతో సినీరంగ ప్ర‌వేశం చేసిన సూర్య‌కాంతం ముందు క‌థానాయిక పాత్ర‌ల‌కోసం ప్ర‌య‌త్నం చేసినా, త‌రువాత చిత్రాల‌లో వ‌రుస‌గా వ‌చ్చిన అవ‌కాశాల‌తో ఒక విల‌క్ష‌ణ న‌టిగా పేరు తెచ్చుకోవ‌డం జ‌రిగింది. ముఖ్యంక‌గా ఆవిడ స్పష్టంగా ప‌లికే సంభాష‌ణ‌ల్లోని విరుపులు వాటిలోని మెరుపులు ప్రేక్ష‌కులు అభిమానించేవారు.  అంతేకాదు ఏ పాత్ర‌లోనైనా ఒదిగిపోయి స‌హ‌జంగా న‌టిస్తూ అది హాస్య పాత్ర అయితే చ‌క్క‌టి హాస్యాన్ని పండిస్తూ ఆ పాత్ర‌కు జీవం పోయ‌డం సూర్య‌కాంతం న‌ట‌నా ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. అమాయ‌క‌త్వంతో కూడిన పాత్రయినా, అడ‌డ‌గ‌కుండానే స‌ల‌హానిచ్చే పాత్ర అయినా అసూయ ప‌రురాలు అయినా ఆడ‌ప‌డుచుగా అయినా కోడ‌ళ్ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టే అత్త‌గా అయినా అన్నిటికీ మించి అనురాగ‌వ‌తి అర్ధాంగిగా ఇలా సూర్య‌కాంతం విభిన్న‌మైన పాత్ర‌ల‌ను విశిష్టంగా పోషించి విశాలాంధ్ర ప్రేక్ష‌కుల అభిమానం పొంద‌డం విశేషం. స‌మ‌ర్ధ‌మ‌యిన న‌ట‌న‌కు సూర్య‌కాంతం అంద‌మ‌యిన కొల‌మానం.


ఇప్పుడు సూర్య‌కాంతం న‌టించిన కొన్ని పాత్ర‌ల‌ను ప‌రిశీలిస్తే ఎన్నో ఆస‌క్తిక‌ర‌మ‌యిన విష‌యాలు తెలుస్తాయి. సూర్య‌కాంతం చ‌ల‌న చిత్ర ప్ర‌స్ధానం ప‌రిశీలిస్తే ఇలా ఎంతో ప్ర‌జ్ఞావంతంగా న‌టించిన పాత్ర‌లు  ఎన్నో క‌ళ్ల‌ముందు క‌దులుతాయి. మొద‌ట్లో కొన్ని చిత్రాల్లో సాత్విక‌మైన పాత్ర‌లు ధ‌రించినా, సూర్య‌కాంతంలోని వాగ్ధాటి గ‌మ‌నించిన ద‌ర్శ‌కులు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌ల‌ను ఇవ్వ‌డం ప్రారంభించారు. ఓ అసూయ‌ప‌రురాలిగా, కుటుంబాల‌న్ని కూల్చే పాత్ర‌లో క్ర‌మంగా స‌ర్య‌కాంతం త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ముద్ర వేసుకోవ‌డం జ‌రిగింది. అలాంటి పాత్ర‌లు సూర్య‌కాంతం త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేద‌న్నంత గొప్ప‌గా న‌టించ‌డం చిత్రంలోని మిగిలిన ముఖ్య‌మైన పాత్ర‌ల‌తో పాటు, సూర్య‌కాంతం పాత్ర‌కూడా ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోవ‌డం ఆమె న‌ట‌నా ప్ర‌తిభ అని చెప్పాలి.


తోడికోడ‌ళ్లు, మాంగ‌ల్య‌బ‌లం చిత్రాల్లోని సూర్య‌కాంతం న‌టించిన పాత్ర‌లు గురించి చెప్పుకుంటే.... త‌రువాత కాలంలో ఇలాంటి పాత్ర‌ల‌ను సూర్య‌కాంతం న‌టించిన పాత్ర‌లు గురించి చెప్పుకోవాలి. అయితే త‌రువాతి కాలంలో ఇలాంటి పాత్ర‌ల‌నే సూర్య‌కాంతం మ‌రి ఎన్నో చిత్రాల్లో న‌టించినా ఏపాత్ర‌కు త‌గిన‌ట్టు ఆ పాత్ర‌లో వైవిధ్య న‌ట‌న ప్ర‌ద‌ర్శించ‌డం ఆమె సృజ‌నాత్మ‌క‌త‌ను తెలియ‌జేస్తుంది. ఇటువంటి పాత్ర‌ల్లో చేయ‌వ‌ల‌సినదంతా చేసి త‌న పాత్ర‌లోని దుష్ట‌స్వ‌భావాని్న తెలియ‌జేస్తూ చివ‌రిలో ప‌శ్చాతాపం ప్ర‌క‌టించినా ప్రేక్ష‌కులు సూర్య‌కాంతం న‌ట‌న‌ని అభిమానించేవారు. ఇక గ‌య్యాళి పాత్ర‌ల‌కు సూర్య‌కాంతం ఒక ట్రేడ్‌మార్క్ అనడం అతిశ‌యోక్తి కాదు. 
గ‌య్యాళి పాత్ర‌ల్లో సూర్య‌కాంతం ఎంత‌గా పేరు తెచ్చుకున్నారంటే ఆ కాలంలో ఆ పేరు పెట్ట‌డానికి భ‌య‌ప‌డేవారు. మ‌రి కాస్త నోటి దురుసు ఉన్న‌వారికి సూర్య‌కాంతంలా ఏమిటి అరుపులు అన‌డం సూర్య‌కాంతం పొందిన పేరుకు గుర్తింపు అని చెప్పుకునేవారు.  ఇక సాత్విక‌మ‌యిన మాత్రృమూర్తిగా కూడా సూర్య‌కాంతం పోషించిన పాత్ర‌ల గురించి చెప్పుకోవాల్సివ‌స్తే...భ‌ర‌ణీవారి బాట‌సారి చిత్రంలో క‌న్న‌త‌ల్లి కాక‌పోయినా క‌థానాయ‌కుని గురించి అనుక్ష‌ణం ఆరాట‌ప‌డే పిన‌త్ల‌లి పాత్ర‌లో సూర్య‌కాంతం న‌ట‌న‌ను చూడ‌వ‌ల‌సిందే. కొడుకు కోసం త‌ల్ల‌డిల్లే త‌ల్లి మ‌న‌సు ఆమె న‌ట‌న‌తో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది.


అల‌నాటి అగ్ర‌న‌టీ న‌టులంద‌రితోనూ, స‌ర‌స‌మాన ప్ర‌తిభావంతంగా ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌యిన పాత్ర‌ల‌తో న‌టించిన సూర్య‌కాంతం, ఆ చిత్రాల విజ‌యానికి ఎంతో స‌హాయ‌ప‌డింది. ఒకే ర‌క‌మ‌యిన గ‌య్యాళి పాత్ర‌ను ఎన్నో చిత్రాల‌లో పోషించినా ప్ర‌తి పాత్ర‌నూ వైవిధ్య‌భ‌రితంగా ఉండేట్టు న‌టించ‌డం వ‌ల్ల ప్రేక్ష‌కుల‌కు విసుగు క‌లిగేది కాదు. అలా న‌టించ‌డం సూర్య‌కాంతంలోని ఉత్త‌మ న‌ట‌న‌కు ఉన్న‌త ప్ర‌మాణం వెండితెర‌మీద ఎంత గ‌య్యాళిగా క‌నిపించినా జీవితంలో శ్రీ‌మ‌తి సూర్య‌కాంతం, మంచి మ‌నిషిగా స‌హృద‌యురాలిగా పేరు పొంద‌డం విశేషం...
నేటికీ సూర్య‌కాంతం లాంటి న‌టీమ‌ణి తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ లేరంటే అతిశ‌యోక్తి కాదు...


suryakantham
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ 'బ్రోచేవారెవరురా'
ఆ పాత్ర చేయ‌లేను-ఆదిసాయికుమార్‌
ప్రేక్షకుల దగ్గరకు 'రాజ్‌దూత్‌' యూనిట్‌ టూర్‌
పోస్ట్  ప్రొడక్షన్ లో  `నా పేరు రాజా` 
కరుణామయుడుస‌గా  లోహిత్ కుమార్
సునీల్ ఆ పాత్రలో మెప్పిస్తాడా?
 అక్కినేనితో జ‌త‌క‌ట్ట‌నున్న మ‌హాన‌టి
రాజ‌శేఖ‌ర్ 'కల్కి' సెన్సార్ పూర్తి...
పాత్ర‌కు నేను మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌ను- డా.హ‌రినాథ్ పొలిచెర్ల‌
మిత్ర పాత్ర‌ నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది- నివేదా థామ‌స్‌
ల‌య‌న్ కింగ్ లో స్కార్ పాత్ర కి డ‌బ్బింగ్ చెప్పిన జ‌గ‌ప‌తిబాబు
ఆర్య " గజేంద్రుడు సూప‌ర్ స‌క్సెస్‌
ఫుల్ ఫ్లెడ్జెడ్ హీరోగా తేజ సజ్జ..
ముంబై  లో రాంగోపాల్ వర్మ ఆవిష్కరించిన  "ఆగ్రహం"   టీజర్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా సెలబ్రిటీ షో - స్పందన
‘సెక్షన్‌ 497 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’’ చిత్రం ప్రారంభం
ట్రెండింగ్‌లోకి వచ్చిన 'కౌసల్య కృష్ణమూర్తి' ఫస్ట్‌ సాంగ్‌ 'ముద్దాబంతి పూవు '
వరుణ్‌తేజ్‌-హరీష్‌ శంకర్‌ల 'వాల్మీకి' ప్రీ టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌
'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల!
చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా
మారుతి దర్శకత్వంలో, బన్ని వాస్ నిర్మాతగా "ప్రతిరోజు పండగే" ఘనంగా ప్రారంభం
200 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంటున్న  మహేష్‌  'మహర్షి'.
రాగల 24 గంటల్లో ఫస్ట్ లుక్ విడుదల 
తలచినదే జరిగినదా' నూతన చిత్ర ప్రారంభోత్సవం..
విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన హీరో ఆది సాయికుమార్ 'బుర్రకథ' ట్రైలర్..
విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన హీరో ఆది సాయికుమార్ 'బుర్రకథ' ట్రైలర్..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.