యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి.  జూన్ 28 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి.  మొదట ఈ సినిమాను జులై లేదా ఆగష్టులో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.  

ఏమైందో తెలియదు సడెన్ గా ప్రీ ఫోన్ చేసుకొని జూన్ 28 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.  ఈ ప్రకటన ఎందుకు చేశారో తెలియదుగాని, సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన కొద్దిసేపటికి శ్రీ విష్ణు బ్రోచేవారెవరురా మూవీని కూడా జూన్ 28 వ తేదీన రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు ప్రకటించారు.  

ఈ సినిమాపై హోప్స్ ఉన్నాయి.  శ్రీ విష్ణు తో పాటు, నివేత థామస్ హీరోయిన్ గా చేస్తోంది.  ఈ రెండు సినిమాలతో పాటుగా అదే రోజున ఆది బుర్రకథ కూడా రిలీజ్ కాబోతున్నది.  డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది.  

జూన్ 28 న అనుకుంటున్న మూడు సినిమాలు వేరువేరుగా పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో.. సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  మూడు బాగున్నాయి అని తెలిస్తే... మంచి వసూళ్లు వస్తాయి.  ఏదైనా తేడా కొడితే మాత్రం మరుసటి రోజే దుకాణం సర్దేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: