చిన్న చిన్న పాత్రలు పోషించిన శ్రీ విష్ణు ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్‌ని పోషించాడు. ఇక హీరోగానూ నిలదొక్కుకుంటున్నాడు. అయితే హీరోగా మారిన తర్వాత రొటీన్ కి భిన్నంగా కాస్త విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటు ఒక ప్ర్త్యేకమీన్ స్థానాన్ని సంపాదించుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'బ్రోచేవారెవరురా'. శ్రీ విష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు చిత్ర బృందం. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 


శ్రీవిష్ణుతోనే తన మొదటి సినిమా మెంటల్ మదితో పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాని కూడా అద్భుతంగా తెరకెక్కించాడని సమాచారం. ఇప్పటికే టీజర్ వెరైటీ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోగా త్వరలోనే ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్  చేయనున్నారు. ఇక ఈ సినిమాలో ఫిలిం మేకర్ గా సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నివేత పేతురాజ్ నిర్మాతగా ఓ పాత్ర చేస్తుండగా ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మంచి పాజిటివ్ బజ్ తో విడుదలవుతున్న బ్రోచేవారెవరురా కు అదే రోజు గట్టి పోటీ ఇచ్చే సినిమాలేవీ లేవు. 


కాబట్టి జస్ట్ మౌత్ టాక్ బావుంటే మాత్రం డెఫినెట్‌గా ఈ సినిమా సక్సస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. సినిమా ప్రపంచంలో జరిగే కొన్ని వాస్తవిక సరదా సంఘటనలను ఆధారంగా చేసుకొని అల్లుకున్న కథలో బ్రోచేవారెవరురా ఖచ్చితంగా అలరిస్తుందని వివేక్ ఆత్రేయ నమ్మకంగా ఉన్నాడు. ఇతని మొదటి సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన వివేక్ సాగర్ దీనికీ ట్యూన్స్ ఇవ్వడం విశేషం. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన బ్రోచేవారెవరురా మీద శ్రీవిష్ణు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఇవి ఎంతవరకు నెరవేరుతాయో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: