ఎన్టీఆర్ బయోపిక్ తరువాత తనకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను తో సెట్స్ మీదకు వెళ్ళాలనుకున్నారు బాలయ్య. అయితే శ్రీనుకి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో తీసిన విన విధేయ రామ షాకిచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో బాలయ్య శ్రీనుతో సినిమా చేయడానికి బాగా ఆలోచించారు. ఈ లోగా జై సింహా వంటి హిట్టిచ్చిన కె.ఎస్.రవికుమార్-సి.కళ్యాన్ బాలయ్యకు మంచి పొల్టికల్ బ్యాగ్డ్రాప్ కథ చెప్పి ఓకే చేపించుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కథ ను పక్కన పెట్టేశారు. అంతేకాదు ఈ సినిమా ఆగిపోయిందంటూ కూడా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు దాదాపు నెల రోజులుగా వార్తల్లో నానుతున్న సి కళ్యాణ్-కేఎస్ రవికుమార్ ప్రాజెక్టు ఫైనల్ అయింది. ఈనెల 13న ఈ సినిమాకు పూజ నిర్వహించబోతున్నారని లేటెస్ట్ అప్‌డేట్.


నిజానికి ఈ సినిమా ఇప్పటికే సెట్ మీదకు వెళ్లాలి. దాదాపు 50శాతం షూటింగ్ కూడా కంప్లీటవ్వాలి. కానీ కథ విషయంలో సమస్య వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో వైఎస్ జగన్ ను విలన్ గా చూపిస్తూ ఓ కథ అల్లుకున్నారట. అంతేకాదు వైఎస్ రాజారెడ్డి క్యారెక్టర్ గుర్తుకువచ్చేలా కూడా ఓ పాత్రను రాసుకున్నారని ఫిల్మ్ నగర్‌లో ఒక వార్త బాగా హల్‌చల్ చేసింది. 


కానీ ఎప్పుడయితే వైఎస్ జగన్ అఖంఢ మెజారిటీతో గెలుపు సాధించడంతో ఆ కథను మూలన పడేసారు. కొత్త కథ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొత్తానికి దర్శకుడు పరుచూరి మురళి చెప్పిన ఓ కథను బాలయ్య ఫైనల్ చేసారు. ఈ కథలో బాలయ్య పోలీస్ అధికారిగానే నటిస్తున్నాడు. అక్టోబర్ నాటికి ఈసినిమాను ఫినిష్ చేసే ఉద్దేశంతో ప్లానింగ్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. అందుకే ఈ నెల 13న పూజా కార్యక్రమాలను నిర్వహించి, జులై నుంచి సెట్ మీదకు వెళ్తబోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: