టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు స్టార్ డైరెక్టర్స్ గా కోట్లు సంపాదించాక నిర్మాతలుగా మారిన వాళ్లే. ప్రస్తుతం అగ్ర దర్శకులుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హవా నడిపిస్తున్న రాజమౌళి సుకుమార్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇలా చాలామంది నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకొని సక్సస్ అయినవాళ్ళే. ఇప్పుడు ఈ కోవలోకి మరో దర్శకుడు వచ్చి చేరుతున్నాడు. అతనే.. కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ. మాస్ మహారాజా రవితేజ నటించిన 'పవర్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బాబీ.. ఆ తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్' 'జై లవకుశ' సినిమాలు తీశాడు. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వెంకటేష్-నాగచైతన్య కాంబినేషన్లో 'వెంకీ మామ' చేస్తున్నాడు. 


ఒకవైపు దర్శకుడిగా కొనసాగుతూనే త్వరలోనే  నిర్మాతగా ఒక సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తాడటని లేటెస్ట్ న్యూస్. ఐతే ఈ సినిమాకి బాబీ దర్శకుడు కాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సప్తగిరి సినిమా 'వజ్ర కవచధర గోవింద'కు దర్శకత్వం వహించిన అరుణ్ పవార్.. బాబీ నిర్మాణంలో తేజు హీరోగా సినిమా చేయబోతున్నాడట. 'బెస్ట్ యాక్టర్స్' అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అరుణ్ పవార్.. ఆ తర్వాత సప్తగిరిని హీరోగా పరిచయం చేస్తూ 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' తీశాడు. తర్వాత మళ్లీ సప్తగిరితోనే 'వజ్ర కవచధర గోవింద' సినిమా చేశాడు. 


ఐతే అరుణ్ పవార్ రేంజికి తేజుతో సినిమా అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. తేజు ఎంత ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ఒక స్థాయి ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతను మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెడుతున్నాడు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలో ఆ సినిమా తెరకెక్కనుంది. అలాంటి హీరో చిన్నా చితకా సినిమాలు తీసిన అరుణ్ పవార్ తో సినిమాకు ఓకే అన్నాడంటే ఆశ్చర్యం కలుగుతోంది. మరి తేజు ఈ సినిమాని ఎందుకు ఫైనల్ చేశాడో మాత్రం ఇంకా అఫీషియల్‌గా తెలీలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: