బాహుబలి సృష్టించినన్ని రికార్డులు ఏ ఇండియన్ సినిమా కూడా సృష్టించలేదు. కానీ బాలీవుడ్ బాక్సాఫీసుకి మాత్రం సల్మాన్ ఖానే బాహుబలి.  వందకోట్లు, రెండు వందల కోట్లు, మూడు వందల్ కోట్లు. ఇవి అతని సినిమాలు సాధిస్తున్న విజయాలు.

ఒక్కసారి వందకోట్ల క్లబ్ దాటాక దానికి అలవాటు పడిపోయాడు. వందకోట్లు దాటిన సినిమాలు అతనివి చాలానే ఉన్నాయి. ఒక్కసారి వందకోట్లు దాటాక చాలా ఈజీగా రెండు వందల కోట్ల మార్కుని దాటేస్తున్నాడు.

అలాగే మూడు వందల కోట్లలో అడుగు పెట్టడం మొదటిసారి కాదు. ’టైగర్ జిందా హై’, ’భజరంగి భాయ్ జాన్’ ’సుల్తాన్’ లాంటి సినిమాలతో మూడు వందల కోట్లు సాధించాడు. ఇప్పుడు మరోసారి ఆ మార్కును ’ భారత్ ’ తో దాటబోతున్నాడు. భారత్ సినిమా తొలి వారంలోనే నూట యాభై కోట్ల నెట్ వసూళ్ళు సాధించింది.

సోమవారం వసూళ్ళు బాగున్నాయనే రిపోర్ట్సు వస్తున్నాయి. ఒకవైపు షారుక్ ఖాన్ వందకోట్లు చేరుకోవడమే గగనమైపోతుంటే, ఆమీర్ ఖాన్ ’దబాంగ్’ తర్వాత స్లో అయిపోతే సల్మాన్ మాత్రం కోట్లకి కోట్లు కొల్లగొడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: