వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతంలో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ సినిమా చేసి బాక్సాఫీసు దగ్గర విజయం సాధించిన రవితేజ ఆ తర్వాత ఆ ఊపుని కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం వీ ఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు రవితేజ. డిస్కో రాజా షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతుంది ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్, నాభా నటేష్ నటిస్తున్నారు. పిరియాడికల్ డ్రామా కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు రవితేజ అభిమానులు.


ఎలాగైనా డిస్కో రాజాతో  హిట్ కొట్టాలని ఇండస్ట్రీలో రవితేజ నిలబడాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో వరుసగా సినిమాలు పరాజయం పాలు అవుతున్న క్రమంలో వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ తన కెరియర్లోనే ఎప్పుడు లేని విధంగా బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు రవితేజ. ప్రస్తుతం చేస్తున్న డిస్కో రాజా సినిమా పూర్తి కాకముందే మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టేసాడు మాస్ మహారాజ్ రవితేజ.


ఈ సినిమా తర్వాత రవితేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే గోపిచంద్ మలినేనితో మరో సినిమా చేస్తాడని టాక్ ఉంది. అయితే ఊహించని విధంగా రవితేజ ఇప్పుడు ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది అనే ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. మహా సముద్రం టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అని సమాచారం. మొత్తంమీద రవితేజ ఫ్లాపుల్లో ఉంటూ కూడా ఎప్పుడూ లేని విధంగా తన కెరియర్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: