ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ హీరోల్లో అద్భుతంగా నటించగల హీరోలు ఎవరు? పేజీలకు పేజీలు డైలాగులు  సింగిల్ టేక్ లో ఫినిష్ చేయగల సత్తా ఉన్న హీరో ఎవరు అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్.

ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉండే నటుల్లో ఒకరైన సమీర్ ఒక ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. జూ ఎన్టీఆర్ ఎంతపెద్ద డైలాగులైన ఒకసారి చదివేసి చెప్పేస్తారని, ఆయన్ని బీట్ చేసే వారు ఇండస్ట్రీలో లేరని అన్నారు.

రాఖీ సినిమాలో రైల్వేస్ గురించిన డైలాగ్ మొత్తం సింగిల్ టేక్ లో చేసాడట. పక్కన ఉన్న కోట శ్రీనివాసరావు గారు డైలాగ్ పూర్తయ్యక ఎన్టీఆర్ ని దగ్గరకి తీసుకున్నారట.

తారక్ వెర్సటైల్ యాక్టర్. ఏదైనా చేయగలడు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు. యమదొంగ సమయంలో తారక్ తో కలిసి డైలాగులు చెప్పడానికి మోహన్ బాబు కూడా భయపడ్డాడట. యమదొంగ థియేటర్ లో చూసినపుడు తారక్ డైలాగు వచ్చినపుడు జూ ఎన్టీఆర్ తల్లి కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయని గుర్తు చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: