సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మహర్షి.  ఈ సినిమాకి బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన లభించినప్పటికి , కలెక్షన్లు మాత్రం జోరుగానే ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ ఈ సినిమాకి బాగా కలిసొచ్చాయి.

మహేష్ బాబు కెరీర్లో ఇప్పటివరకు వందకోట్లకి పైగా షేర్ సాధించిన చిత్రం ఒక్కటి కూడా లేదు. తొలిసారిగా మహర్షి చిత్రం ఆ ఫీట్ ని సాధించింది. అయినా కానీ కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే ఉన్నారు.

మహర్షి సినిమా రికార్డుల దిశగా పయనిస్తుంది . ముందుగా చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150 ’ నెలకొల్పిన 102 కోట్ల రికార్డుకు దగ్గరలో ఉంది. త్వరలోనే ఈ రికార్డు బద్దలు కొట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

మహర్షి సినిమా ఇప్పుడు ఐదవ స్థానంలో  ఉంది. ఖైదీ నంబర్ 150 దాటి నాల్గవ స్థానానికి ఎగబాకనుంది. మూడవ స్థానంలో ఉన్న రంగస్థలం 120 కోట్ల మార్కుని దాటడం మాత్రం చాలా కష్టం . మొదటి రెండు స్థానాల్లో బాహుబలి 2 ,బాహుబలి 1 ఉన్నాయని తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: