సాధారణంగా సెలెబ్రిటీల విషయాలపై జనాలకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటిది ఆ విషయం ప్రేమ వ్యవహారమైతే ఆ ఆసక్తి ఇంకా రెట్టింపు అవుతుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇటువంటి వార్తలు రోజుకొకటి దర్శనమిస్తున్నాయి.

ఇందులో చాలా మటుకు పుకార్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పుకార్లను కొంతమంది కావాలనే పుట్టిస్తున్నారు. దీంతో వీటి పట్ల ఆ సెలెబ్రిటీలు స్పందిస్తే గానీ అసలు విషయం బయటకు రాదు.ఇప్పుడు అటువంటి పుకారే టాలీవుడ్ యంగ్ హీరీయిన్ అనుపమపై పడింది.

వివరాల్లోకి వెళితే అనుపమకి భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా కి గత కొద్ది కాలంగా ప్రేమాయణం నడుస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.  ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒకరినొకరు ఫాలో అవుతుండడం కూడా ఈ పుకార్లకి బలాన్నిచ్చింది.

తాజాగా అనుపమ ఈ దీనిపై స్పందించింది. బుమ్రా తనకు స్నేహితుడు మాత్రమేనని, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదని తేల్చి చెప్పింది. ఎవ్వరికి ఉపయోగం లేని ఇటువంటి వార్తలు సృష్టించడం వల్ల ఏమొస్తుందో అర్థం కావడం లేదని రియక్ట్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: