మరో నెల రోజుల్లో స్టార్ మా చానెల్లో బిగ్ బాస్ సీజన్ 3 మొదలవ్వబోతుంది. ఇప్పటిదాకా రెండు సీజన్లు హిట్టైనప్పటికీ అందులో బాగా పేరు పొందిన సెలబ్రిటీలు లేరనే విమర్శ ఉంది. ఈసారి మాత్రం తప్పు జరగకుండా బిగ్ బాస్ 3 నిర్వహకులు జాగ్రత్త పడుతున్నారట

 

వీ6 చానెళ్ళోని సావిత్రి సారి బిగ్ బాస్ హౌస్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందట. ఇక శ్రీముఖి ప్రస్తుతానికి పటాస్ షోకు దూరంగా ఉండటంతో బిగ్ బాస్ నిర్వహకులు సంప్రదిస్తున్నారట. వీళ్ళిద్దరికీ యూత్లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి వీళ్ళు సెలబ్రిటీలుగా ఒప్పుకుంటే అది షోకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది

 

బండ్ల గణేష్ ను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నా ప్రస్తుతం బండ్ల గణేశ్ మహేశ్ అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నందున బిగ్ బాస్ షోకు వచ్చే అవకాశం లేదు. కె పాల్ కూడా షోలో పాల్గొంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ కమెడియన్లను, సింగర్స్ ను, ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లను షో కు తీసుకువెళ్ళటానికి ప్రయత్నాలైతే ముమ్మరంగా జరుగుతున్నాయి మరి వార్త నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి


మరింత సమాచారం తెలుసుకోండి: