చిరంజీవి పెద్ద కూతురు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా చిరంజీవి చరణ్ ల సినిమాలకు సలహాలు ఇవ్వడమే కాకుండా వారు నటిస్తున్న సినిమాల కాస్ట్యూమ్స్ వ్యవహారంలో సుష్మిత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ మూవీకి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ విషయంలో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అంజు మోడీతో కలిసి ‘సైరా’ కు చాల వెరైటీ కాస్ట్యూమ్స్ ను సుస్మిత డిజైన్ చేసింది. 

ముఖ్యంగా ఈమూవీలో నర్తకీగా నటిస్తున్న తమన్నా వేసుకున్న కాస్ట్యూమ్స్ కోసం సుస్మిత సుమారు 500 మంది డిజైనర్స్ సలహాలు తీసుకుని తమన్నా లెహంగి ని డిజైన్ చేసిన విషయాన్ని మిల్కీ బ్యూటీ బయటపెట్టింది. అంతేకాదు తన కెరియర్ లో తాను ఎంతోమంది డ్రెస్ డిజైనర్స్ ను చూశానని అయితే సుస్మిత తన పని పట్ల చూపించే శ్రద్ధ తాను ఏ డ్రెస్ డిజైనర్ లోను చూడలేదు అంటూ తమన్నా కామెంట్స్ చేసింది. 

ముఖ్యంగా ఈమూవీలో చిరంజీవి తమన్నాల పై చిత్రీకరించిన ఒక రొమాంటిక్ సాంగ్ లో రాజ నర్తకి గా డాన్స్ చేసిన తమన్నా కోసం ఆమె డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఈమూవీకి హైలెట్ గా మారుతాయి అని తమన్నా అంటోంది. ‘బాహుబలి’ తరువాత కాస్ట్యూమ్స్ విషయంలో నిజమైన రాయల్ టచ్ కనిపిస్తూ ‘సైరా’ చూసే వారు 18వ శతాబ్దపు రోజులలోకి వెళ్ళిపోవడం ఖాయం అని అంటోంది తమన్నా. 

‘ఎఫ్ 2’ తరువాత సక్సస్ ట్రాక్ ఎక్కిన తమన్నాకు ‘సైరా’ విడుదల తరువాత అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి సినిమాలకు మాత్రమే కాకుండా ప్రస్తుతం చరణ్ నటిస్తున్న సినిమాలకు కూడ సుస్మిత కాస్ట్యూమ్స్ సలహాలు అందిస్తూ మెగా డాటర్ గా తన నైపుణ్యతను నిరూపించుకుంటోంది..      


మరింత సమాచారం తెలుసుకోండి: