తెలుగు తెరపై రోజుకో కొత్త అందం వచ్చేస్తోంది. నిన్నటి అందం నేటికి పాతదైపోతోంది. ఈ టైంలో హిట్ కొట్టినా కూడా ఆఫర్లు రావడం కష్టమైపోతోంది. ఎన్ని రకాలుగా టాలెంట్ చూపినా కూడా ఇపుడున్న రోజుల్లో చాన్స్ అన్నది అతి పెద్ద మాటగా అయిపోతోంది.


ఈ పరిస్థితుల్లో  ఎఫ్ 2 వంటొ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెహ్రిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ మూవీ సక్సెస్ అంతా వెటరన్ హీరో వెంకీ ఖాతాలోకి కొంత, డైరెక్టర్ ఖాతాలోకి మరి కొంత వెళ్ళిపోయింది. తమన్నా అందాలు ఆరబోసినా, మెహ్రిన్ మెరిసినా కూడా ఇద్దరు హీరోయిన్లకు నో చాన్స్  దాంతో చాన్నాళ్ళుగా అవకాశాలు లేకుండా వెనకబడిపోయింది. ఇపుడు నందమూరి వారి అబ్బాయి కళ్యాణ్ రాం మూవీలో మెహ్రిన్ కి ఎట్టకేలకు ఓ చాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

 ప్రస్తుతం వేణు మల్లిడి దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ ‘తుగ్లక్’ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సతీశ్ వేగేశ్నతో ప్రాజెక్టు చేయనున్నాడు. ఆ ప్రాజెక్టు కోసం హీరోయిన్‌గా మెహ్రీన్‌ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.\


కుటుంబ కథా చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సతీశ్ వేగెశ్న, కళ్యాణ్‌రామ్‌తోనూ అదే తరహా సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథను కళ్యాణ్ కోసం సిద్ధం చేశాడని అంటున్నారు. ఈ కథలో మెహ్రీన్‌కీ అంతే ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: