ప్రస్థుతం సినిమాలలో లిప్ లాక్ సీన్ సర్వసాధారణం. ఇలాటి సీన్స్ లేకుండా సినిమా వస్తే ఆశ్చర్యంకాని విడుదలైన సినిమాలలో లిప్ లాక్ సీన్స్ లేవు అంటే ఆశ్చర్య పడాలి. నిజంగా చెప్పాలి అంటే ఈ లిప్ లాక్ కల్చర్ హాలీవుడ్ సినిమాల నుంచి దిగుమతి అయింది అని అనుకుంటారు అంతా. 

అయితే షాక్ ఇచ్చే విషయం ఏమిటంటే ఈ లిప్ లాక్ సీన్ కల్చర్ ను క్రియేట్ చేసింది ఒక ఇండియన్ సినిమా అంటే ఎవరు నమ్మలేని నిజం. 1929 లో వచ్చిన మూకీ మూవీ ‘ఏ ధ్రో ఆఫ్ డైస్’ మూవీలో తొలిసారిగా ముద్దు సన్నివేశాన్ని ప్రేక్షకుల పరిచయం చేసింది ఒక ఇండియన్ ఫిలిం డైరెక్టర్. 

మహాభారతం ఆధారంగా కల్పిత కథతో తెరకెక్కిన ఈమూవీలో చిత్రీకరించిన ఈ లిప్ లాక్ సీన్ లో నటించిన సీతాదేవి చారురాయ్ అనే నటీనటులు ఒక్క క్షణం పాటు తమ పెదవులను కలపడం అప్పటి సంచలనం. అయితే లిప్ లాక్ ను పూర్తిగా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసిన మూవీ 1930 లో వచ్చిన ‘కర్మ’ సినిమాలో ఉంది. 
నిజ జీవితంలో భార్య భర్తలైన అప్పటి టాప్ స్టార్స్ దేవికా రాణి హిమాన్షు రాయ్ లు సినిమాలో ప్రేమికులుగా నటించిన ఈమూవీలో ఒక సన్నివేశంలో ఏకంగా 4 నిముషాల పాటు లిప్ లాక్ సీన్ ను పెట్టడం సంచలనంగా మారడమే కాకుండా ఆ రోజులలోనే తీవ్ర విమర్శలకు దారితీసింది.

దీనితో సెన్సార్ అభ్యంతరాలు ఎదురౌతున్నాయని గ్రహించిన ఫిలిం మేకర్స్ చాల సంవత్సరాలు ఈ లిప్ లాక్ సీన్స్ ను హీరో హీరోయిన్స్ పూలమొక్కల వెనుక గోడుగులలో చూపెడుతూ చాల సంవత్సరాలు ఈ పద్ధతిలోనే సినిమాలలో లిప్ లాక్ సీన్స్ ను తీసారు. అయితే ఇప్పుడు సెన్సార్ పూర్తిగా ఈవిషయంలో గేట్లు తెరవడంతో తిరిగి మళ్ళీ ఓపెన్ సీక్రెట్ లా డీప్ లిప్ లాక్ సీన్స్ హవా మొదలైంది. ఈ ఏడాదితో ‘లిప్ లాక్’ కు 90వ పుట్టినరోజు జరగడంతో దీని కథ అందరికీ తెలిసింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: