Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 1:03 pm IST

Menu &Sections

Search

సింగర్ సునీత ఆ స్వామీజీ పై ఫైర్!

సింగర్ సునీత ఆ స్వామీజీ పై ఫైర్!
సింగర్ సునీత ఆ స్వామీజీ పై ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
swaroopaanandeandruni-comments-on-singar-suneeta
ప్రముఖ తెలుగు సింగర్ ఉపద్రష్ట సునీతపై తరచూ ఏదో పుకార్ వినిపిస్తూనే ఉంటుంది. సునీత సినీరంగానికి చెందిన వ్యక్తి కావడం, చక్కటి అందగత్తె కావటం  పరిశ్రమలో కీర్తి ప్రతిష్టలు ఉండటం ఇందుకు కారణం అయుండొచ్చు. సహజంగా సునీత కూడా తనపై వచ్చే రూమర్స్ పై పెద్దగా స్పందించదు, పట్టించు కోదు. స్పందన అనివార్యం అయ్యే సమయంలో అంటే తన మనసుకు చాలా బాధ కలిగించే తరుణంలో ఆమె మౌనం పాటించదు. ఆమె రియాక్ట్ అవుతారు. 


తాను మరో పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయంపై ఆమె తక్షణం స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. తాజాగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాటలను ఖండిస్తూ ఆమె  పోస్ట్ పెట్టారు. స్వరూపా నందేంద్ర సరస్వతిపై కోపానికి కారణం? ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, తన వద్దకు సినీప్రముఖులు వస్తుంటారని, చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్ అబ్బాయి జగదీష్ వస్తుంటారు. సింగర్ సునీత కూడా వస్తుంటారని అన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి, తాను రాకున్నా తన పేరు చెప్పడంతో సునీత ఆగ్రహానికి  కారణమైంది. నేను అసలు రానప్పుడు నా పేరు ఎలా చెబుతారు? ఆని తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. 
swaroopaanandeandruni-comments-on-singar-suneeta

సునీతా పోస్టింగ్ సమ్మరీ 


"So many rumors I come across everyday developing a thick skin but sometimes some issues are needed to be addressed like how this famous personality #swaroopanandendrasaraswati using my name in his visitors list had made me wonder how people can use anyone's name and that too on a national television channel, and i am yet confused, if I should start developing thick skin towards such issues as well ?"


swaroopaanandeandruni-comments-on-singar-suneeta
‘రోజూ ఎన్నో రూమర్స్ వస్తుంటాయి'  అంటూ సునీత "అన్నింటిపై స్పందించాలని అనుకోము. కాని కొన్ని విషయాలపై తప్ప కుండా స్పందించాలి. స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి ప్రముఖ వ్యక్తి తన వద్దకు వచ్చిన భక్తుల జాబితాలో నా పేరు చేర్చడం అది కూడా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలనే ఈ పోస్టు పెడు తున్నాను, నేను అతడిని కలవక పోయినా ఎందుకు ఇలా చెబుతున్నారో తెలియదు" అంటూ సునీత వ్యాఖ్యానించారు. 


సునీతకు మద్దతుగా ఈ విషయంలో పలువురు అభిమానులు స్పందించారు. ఇలాంటి వారిని ఊరికే వదిలేస్తే ఇంకా చాలా మందిపేర్లు చెప్పి బతికేస్తుంటారు. మీరు సరైన విధంగా కౌంటర్ ఇచ్చారు. మీకు మేము మద్దతుగా ఉన్నాం. అంటూ వ్యాఖ్యా నించారు పలువురు నెటిజెన్స్ కూడా.

swaroopaanandeandruni-comments-on-singar-suneeta

ఇప్పుడు దీనిపై స్వరూపానందేంద్ర సరస్వతి ఎలా స్పందిస్తారో? చూడాలి. సునీత చేసిన ఈ పోస్టు పై రకరకాల చర్చ జరుగు తోంది. స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి వారు తన వద్దకు రాకున్నా, సునీత పేరు ఎందుకు వాడినట్లు? ఆయన ఈ వివాదంపై ఎలా స్పందించబోతున్నారు? అనేది ఆసక్తిగా మారింది. అయితే స్వారూపానంద చెప్పింది 'సింగర్ సునీత' పేరు అయి ఉండకపోవచ్చని మరికొందరి వాదన. 


ఇలాంటి సో..కాల్డ్..గాడ్-మాన్ తనను తాను ప్రచారం చేసుకునే వారి గుఱించి పెద్దగా సింగర్ సునీత పట్టించుకోనవసరం లేదని, ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, గుత్తేదార్లు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార విఫణి ప్రముఖులకు రాష్ట్రాల అధికార కేంద్రాలతో మద్యవర్తిత్వం వహిస్తూ ఒక రకమైన దైవత్వం మూర్తీభ వించని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ  “అధికార కేంద్రానికి అనుసంధానమైన అనధికార రాజ్యాంగేతర లింక్" గా మారినట్లు జనం బహిరంగంగానే అంటున్నారు.   
swaroopaanandeandruni-comments-on-singar-suneeta
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జపాన్ వాళ్ళంతే - మిర్రర్ న్యూరాన్ల స్పందన ఎక్కువట? అందుకే అలా తయారయ్యారు!
షాకింగ్! బీజేపిలోకి సుజానా!
గోవు పరమ పవిత్రం - గోవు వలన ప్రయోజనాలు
ఎడిటోరియల్: దేశంలో ఏ ఇతర నాయకునికి లేని ఆ రోగమే చంద్రబాబు కొంప ముంచింది?
సండే స్పెషల్: చీరకట్టు - కనికట్టు - చీరలో మన హీరోయిన్స్
పదవి పోయినా ఆ ఫోజు మారలేదు - ఇంగువ కట్టిన గుడ్డ వాసన పోనట్లు - టిడిపి గతి అంతే!
ఏపికి ప్రత్యేక హోదా అత్యవసరం, ఇచ్చి ఆదుకోండి : సీఎం వైఎస్ జగన్
పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి “పవన”మో! పలాయనమో!
"షా" వెరైటీ మామిడి పండు - అమృతఫలం రుచి, రూపం, బరువు అద్భుతం
ఈ పిల్ల అందాలకు జిమ్ బయట ఇంటి బయట కాపలా పెట్టాల్సిందే!
తెలంగాణాలో బీజేపి విజృంభణ - రాంమాధ‌వ్ నేతృత్వంలో 'ఆపరేషన్ కమలం'!
About the author