డబ్బు అంటే ఎవరికి ఛేదు..అందులోనూ ఈజీగా డబ్బు కలిసి వస్తుందంటే వెనుకా ముందు ఏదీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు.  ఇలాంటి వారి బలహీనతను కొంత మంది దొంగలు ఈజీగా మోగించేస్తున్నారు. మరికొంత మంది మోసగాళ్లు సోషల్ మాద్యమాల ద్వారా ఫేస్ బుక్, వాట్సాప్ ఇలాంటి వాటితో అమాయకులను ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ లతో పరిచయం అయి అబ్బాయిలను అమ్మాయిలు..అమ్మాయిలను అబ్బాయిలు దారుణంగా మోసం చేసి డబ్బులు లాగుతున్నారు. ఇలాంటి ఫేస్ బుక్ మోసానికి ఓ యంగ్ హీరోయిన్ దారుణంగా మోసపోయింది.

వివరాల్లోకి వెళితే..టాలీవుడ్ యువ కథానాయిక సోనాక్షి వర్మ ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ నైజీరియన్ ఆమె నుంచి రూ.85 వేలు లాగేసుకున్నాడు. మెర్రిన్ కిర్రాక్ పేరుతో ఇటీవల తన ఫేస్‌బుక్‌ ఖాతాకు వచ్చిన మెసేజ్ చూసిన సోనాక్షి స్పందించడమే పాపమైంది.  సోనాక్షి తన వలలో చిక్కుకుందని గ్రహించిన మెర్రిన్ తన వ్యక్తిగత వివరాలను పోస్టు చేశాడు. తాను లండన్‌లో ఉంటున్నానని, తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని పేర్కొన్నాడు.  తాను సోనాక్షిని ఇష్టపడుతున్నానని...తమ ప్రేమకు గుర్తుగా ఓ కానుక పంపుతున్నానని ఫోన్ చేసి చెప్పాడు. 

ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా అది ఇంటికే వస్తుందని చెప్పుకొచ్చాడు. అనుకున్నట్టే గత నెల 27న ఢిల్లీ విమానాశ్రయ అధికారుల పేరుతో సోనాక్షికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మెర్రిన్ కిర్రాక్ నుంచి బహుమతి వచ్చిందని, అందులో వేలాది డాలర్లు ఉన్నాయని నమ్మబలికాడు.  కాకపోతే ఈ గిఫ్ట్ బాక్స్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపేందుకు రూ.85 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు.

అంతే అమాయకంగా అతని మాటలకు మోసపోయిన సోనాక్షి అతని ఖాతాలో రూ.85 వేలు వేసింది. మెర్రిన్ పంపిన గిఫ్ట్ ఎంతకీ రాకపోవడం..తనకు ఫోన్ చేసిన అధికారికి ఫోన్ చేస్తే స్పందన రాకపోవడంతో తాను దారుణంగా మోసపోయానని తెలిసిపోయింది.  వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: