తెలుగు, తమిళ భాషల్లో బెస్ట్ కమెడియన్స్ లో ఒకరు వడివేలు.  ఆయన పేరు చెబితేనే కడుబుబ్బా నవ్వుకుంటారు..తెలుగులో ఎన్నో డబ్బింగ్ సినిమాల్లో ఆయన తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచారు.  ఇక వడివేలుకి తెలుగు లో బ్రంహ్మానందం డబ్బింగ్ చెప్పడం మరో ప్లస్ పాయింట్ అనొచ్చు.  కమెడియన్ గానే కాకుండా ‘హింసించే 23వ పులకేశి’లాంటి కామెడీ ఎంట్రటైన్ మెంట్ లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

తాజాగా వడివేలు కి ఇన్ కమ్ టాక్స్ వారు భారీ షాక్ ఇచ్చారు.  సీనియర్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వడివేలుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ షాకిచ్చింది. ఆయన అప్పీల్ ని కొట్టివేయడమే కాకుండా జరిమానాను సకాలంలో చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది.  నటుడిగా మంచి ఫామ్ లో ఉన్న వడివేలు భారీగా పారితోషికం తీసుకుంటున్నప్పటికీ పన్ను చెల్లింపు విషయంలో ఫ్రాడ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 2010లో ఆయన రెమ్యునరేషన్ పెరిగినప్పటికీ కేవలం 4లక్షలు మాత్రమే అందుకుంటున్నట్లు లెక్కలు చూపించారు.

ఐటి రెయిడ్ లో 50 లక్షల వరకు ఆయన లెక్క చూపకపోవడంతో  రూ.61.23 లక్షల జరిమానా విధించినట్లు నోటీసులు అందాయి. జరిమానా విధించిన ఐటి నిర్ణయానికి వడివేలు ఆదాయపు పన్ను శాఖ కమిటీలో అప్పీల్ చేశారు. పన్ను ఎగవేతకు పాల్పడటం నిజమని తేలింది కావున వడివేలు అప్పీల్ ని కొట్టి వేశారు. వీలైనంత త్వరగా వడివేలు జరిమానా చెల్లించాలని ఐటి కమిటీ ఆదేశాలు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: