చిన్న హీరోల దగ్గర నుండి టాప్ హీరోల వరకు ఇప్పుడు అందరి దృష్టి రష్మిక వైపే. అయితే రష్మిక తన డేట్స్ ను అందరికీ సద్దుబాటు చేయలేక పోవడంతో ఆమె కొన్ని సినిమాను మాత్రమే ఒప్పుకుంటోంది. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ సంవత్సరంలోని ప్రతిరోజు ఎదో ఒక షూటింగ్ లో రష్మిక ఉండవలసి వస్తోంది అంటే ఆమె క్రేజ్ అర్ధం అవుతోంది.

ఇలాంటి పరిస్థుతులలో రష్మిక ప్రస్తుతం మోస్తున్న అనేక బాధ్యతల పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రష్మికకు ‘ఛలో’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ అవకాసం ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. దీనితో తనకు మొట్టమొదటి ఎంట్రీ అవకాశాన్ని ఇచ్చిన వెంకీ కుడుములకు సహాయపడటానికి ఫెయిల్యూర్ హీరో అని కూడ లెక్క చేయకుండా నితిన్ తో నటిస్తున్న ‘భీష్మ’ షూటింగ్ ఈరోజు నుంచి మొదలైంది.

ఇదే నెల 28వ తారీఖు నుండి మహేష్ తో రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో పాల్గోనబోతోంది. ‘మహర్షి’ సక్సస్ అయినా కలక్షన్స్ రికార్డుల పరంగా అద్భుతాలు చేయలేకపోవడంతో మహేష్ రష్మికతో కలిసి నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతికి విడుదలై రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్నారు.

దీనితో వెంకీ కుడుముల నితిన్ లకు హిట్ మహేష్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించాలి అన్న ప్రయత్నాలు జరుగుతున్న రెండు సినిమాలలోను రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న పరిస్థుతులలో ఈమెకు బాధ్యతలు పెరిగి పోయాయి అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లుగా విజయ్ దేవరకొండకు ‘గీత గోవిందం’ మించి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి రష్మిక విజయ్ తో కలిసి నటించిన ‘డియర్ కామ్రేడ్’ జూలైలో విడుదల కాబోతోంది. ఇలా హీరోల అందరి బాధ్యతలను తలకెత్తుకుని మోస్తూ రష్మిక చాల కష్టపడి పోతోంది అంటూ కొందరు ఆమె పడే కష్టం పై జోక్ చేస్తున్నారు..    



మరింత సమాచారం తెలుసుకోండి: