టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది మెగా హీరోలు వచ్చారు.  ఆ మద్య మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాన్ దేవ్ ‘విజేత’ మూవీతో హీరోగా పరిచయం అయ్యారు.  ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీస్ లో విజేత ఒకటి.  ఇదే టైటిల్ మూవీతో కళ్యాన్ దేవ్ వెండి తెరకు పరిచయం అయినా..విజయం మాత్రం వరించలేదు.  ఒక హీరోకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్న కళ్యాన్ దేవ్ మొదటి సినిమాతోనే దెబ్బైపోయాడు.  


అయితే ప్రస్తుతం మంచి కథ ఎంచుకొని తన మామ సలహాలు పాటిస్తూ తదుపరి సినిమా కోసం ప్లానింగ్ లో ఉన్నాడు కళ్యాణ్ దేవ్.  ఆ మద్య శ్రీజ-కళ్యాన్ దేవ్ లకు పండంటి పాప జన్మించింది.  తాజాగా  కల్యాణ్ దేవ్ కు సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో కొందరు అసభ్యకర కామెంట్లు చేశారు. దీనిపై పోలీసులకు కల్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశారు. 


ఇన్ స్ట్రాగ్రామ్ లో కొంత మంది ఆకతాయిలు కావాలనే కళ్యాన్ దేవ్ ని టార్గెట్ చేసుకొని  ఫొటోల కింద దారుణమైన కామెంట్లు చేస్తున్నారని ఆ ఫిర్యాదు లో పేర్కొన్నారు.  కాగా ఫిర్యాదు స్వీకరించిన సైబర్ పోలీసు అధికారులు ఇన్ స్టాగ్రామ్ కు లేఖ రాస్తామని... కామెంట్లు చేసిన వారి వివరాలు, ఐపీ అడ్రస్ లు కావాలని అడుగుతామని... వారి నుంచి వివరాలు వచ్చిన వెంటనే అసభ్యకర కామెంట్లు చేసిన వారిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: