సినీ  ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల వారసులు, హీరోయిన్ల వారసులు ఇతర టెక్నీషియలన్లు, దర్శక, నిర్మాతల వారసులు హీరోలుగా, హీరోయిన్లుగా వచ్చారు.  అయితే హీరోగా మారిన తర్వాత మంచి ఫామ్ లోకి వస్తే ఆ హీరో తమ్ముడు సైతం ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారను.  అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాన్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా..పవన్ కళ్యాన్ స్టార్ హీరోగా ఎదిగారు. 


రీసెంట్ గా అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్నాడు.  తాజాగా ఇప్పడు తమిళ హీరో చెల్లెలు హీరోయిన్ గా రాబోతుంది.  తమిళంలోని యువ కథానాయకులలో జీవీ ప్రకాశ్ కుమార్ స్థానం ప్రత్యేకం. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమాలు చేస్తూ ఆయన మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.


ఆయన చెల్లెలు భవానిశ్రీ హీరోయిన్ గా వెండితెరకి పరిచయం కానుంది.  ఆమెకు జోడీగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఈ చిత్రం  విరుమాండి  దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. మరో కథానాయికగా భవానీశ్రీని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం సెట్స్ పై వున్న ఈ సినిమాను, తెలుగులోను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: