మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు 'కళ్యాణ్ దేవ్' హీరోగా విజేత  సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చి  ఫ్యామిలీ ఆడియన్స్ ను  ఆకట్టుకున్నే ప్రయత్నం చేసినా,  ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే  ఇన్స్టాగ్రామ్ లో  గత కొన్నిరోజులుగా  కొంతమంది ఆకతాయిలు  తనపై, తన కుటుంబం పై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ వేధిస్తున్నారని,  కళ్యాణ్ దేవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే ఆ పిర్యాధు ఆధారంగా దర్యాప్తు చేపట్టినడీసీపీ రఘువీర్.. వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల ఇన్స్టాగ్రమ్ ఐడీలను గుర్తించామని, వారి పూర్తి  వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.   ఎట్టకేలకు.. మెగాస్టార్ చిన్నల్లుడ్ని వేధించిన వాళ్లు దొరికారు. మరి వారి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 


ఇక తన మొదటి సినిమాలో  నటన పరంగా మంచి ప్రతిభను కనబరిచిన కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రంగా  దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా  తెరకెక్కించనున్న  ఈ చిత్రంలో కళ్యాణ్ పూర్తి గడ్డం లుక్ లో కనిపించనున్నాడు.  అలాగే ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా కొన్ని విభాగాల్లో శిక్షణ కూడా తీసుకున్నాడు.  ఈ సినిమాతోనైనా కళ్యాణ్ దేవ్  సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం.  ఇక రాజేంద్ర ప్రసాద్, నరేష్ ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్స్  నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: