నాగార్జున ఎందుకనో బాగా ప్రభాస్ ని వదలడం లేదు. ప్రభాస్ వెనకో లేదా ముందో నడుస్తున్నాడు. ఎందుకీ పోటీ అన్న విషయం ఇండస్ట్రీలో ఎవరికీ అర్థం అవడం లేదు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా టీజర్ 13న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది. వాస్తవానికి జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నప్పటికి, వర్క్ పూర్తికాక 13న రిలీజ్ చేయబోతున్నారని న్యూస్. ఇదిలావుంటే అదేరోజు కింగ్ నాగార్జున క్రేజీ ప్రాజెక్ట్ మన్మథుడు 2 టీజర్ కూడా రిలీజవుతోంది. సాధారణంగా సాహో లాంటి భారీ సినిమా టీజర్ వస్తోందని తెలిసినపుడు మరో సినిమా టీజర్ వుంటే అది ముందురోజో, వెనుక రోజో విడుదల చేస్తారు. కానీ మన్మథుడు 2 టీజర్ అదేరోజు వస్తోందని ప్రకటించేసారు దర్శక నిర్మాతలు.


అంతేకాదు సినిమా విడుదల విషయంలో కూడా నాగ్ వైఖరి ఇలాగే వుందని తెలుస్తోంది. ఆగస్టు 9న మన్మథుడు 2 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 15న సాహో విడుదల. అలాంటి పెద్ద సినిమా వారంలో విడుదల వుంటే, ముందువారం సినిమా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తారు. ఎంతకాదన్నా సాహో భారీ ప్రాజెక్ట్ కాబట్టి. అవసరమనుకుంటే సాహోకోసం మన్మథుడు 2ను కొన్ని థియేటర్లలోంచి తీసేసే అవకాశము వుంది. 


పైగా సాహోకి ఏస్ డిస్ట్రిబ్యూటర్లు, దిల్ రాజు, గీతా, యువి లాంటి సంస్థల బ్యాంకింగ్ వుంది. నాగ్ కు కూడా థియేటర్ల సమస్య రాదు కానీ వారం తరువాత కలెక్షన్ల విషయంలో, థియేటర్ల విషయంలో సమస్య వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. కానీ నాగార్జున మాత్రం ఏది ఏమైనా ఆగస్ట్ 9న మన్మథుడు-2 రిలీజ్ చేయాలనే పట్టుదలగా వున్నారని తెలుస్తోంది. మరి నాగార్జునకి ప్రభాస్ సాహో మీద నమ్మకం లేకుండా ఉన్నారా..!అన్న విషయం క్లారిటీ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: