నిధి అంటే సంపద. మరి పేరులోనే పెన్నిధిని కొండంత పెట్టుకున్న ఆ భామకు సొగసు సోయగాలు పుష్కలంగా ఉన్నాయి. చూసిన కళ్ళకు చూసినంత అన్నట్లుగా తన బ్యూటీతో హీటిక్కించే బేబీ నిధి అగర్వాల్. చిన్నదాని  వన్నెలు, చిన్నెలు  ఇపుడు కోటలు దాటుతున్నాయి. గోదారి వరదలై  పారుతున్నాయి.


నిధి తెలుగులో సవ్యసాచి మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అన్న నాగ చైతన్యతో చేసిన ఈ అమ్మడు తమ్ముడు అఖిల్ తో మిష్టర్  మజ్ను లో నటించింది. ఇంకా చేతిలో నాలుగైదు మూవీస్ ఉన్నాయి. అయినా నిధికి ఎందుకో కుర్రాళ్ళ  గుండెల్లో మంటలు పెట్టాలని వింత కోరిక పుట్టింది. అంతే దాన్ని వెంటనే అమలు చేసేస్తోంది.


సోషల్ మీడియాతో నిధి రెచ్చగొట్టే పిక్స్ పెడుతూ యూత్ ని బాగా కనెక్ట్ అవుతోంది. దాంతో వెర్రెత్తున్న వారంతా అందాల‌ దేవత అంటున్నారు. నిన్ను తీరిగ్గా ఆ దేవుడు తయారు చేసి ఉంటాడు అని కితాబు ఇస్తున్నారు. కికాస్ బ్యూటీ.. ఝకాస్ పోజ్".. "స్టన్నింగ్ లేడి.. బ్రైట్ నెస్ ఎక్కువ" అని డిఫరెంట్ కామెంట్లు పెడుతున్నారు.


నిధికి తన ఇన్స్టా ఖాతాలో 3.2 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఎలా చూసుకున్నా ఓ కొత్త హీరోయిన్ కు ఈ ఫాలోయింగ్ ఎక్కువే. అయినా తన ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకునేందుకు.. ఫిలిం మేకర్లకు తన గ్లామర్ యాంగిల్ ను కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు ఘాటు పోజులు ఇస్తోంది. కళ్ళలో అందాన్ని నింపుకోండి, గుండెల్లో ఆనందాన్ని నింపుకోండి అంటూ గ్రాడ్ ఆఫర్ ని ఇస్తున్న నిధి నిజంగా రసికులకు పెన్నిధే సుమా.


మరింత సమాచారం తెలుసుకోండి: