తెలుగులో ఐటెం సాంగ్స్ కు పెట్టింది పేరు దేవిశ్రీ.  ఐటెం సాంగ్స్ ఎన్నింటినో దేవిశ్రీ సృష్టించారు.  అప్పుడెప్పుడో ఆ అంటే అమలాపురం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.  అప్పట్లో ఎక్కడ చూసినా ఆ సాంగ్ వినిపిస్తుండేది.  ఆ తరువాత ఎన్నో సాంగ్స్ చేశారు.  ఆకలేస్తే అన్నం పెడతా సాంగ్ సూపర్ హిట్.  గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక.. ఇలా చెప్పుకుంటూ పొతే లిస్ట్ చాలా పెద్దగా ఉంది.  


ఈ సినిమాలు అన్నింటిలోకి సర్దార్ గబ్బర్ సింగ్ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు.  ఇందులో వాడెవడన్నా.. వీడెవడన్నా సింగ్ ఉంది.  ఈ సాంగ్ వరల్డ్ డ్యాన్స్ కాంపిటీషన్ లో ప్రదర్శించి గప్ గెలుచుకుంది ఇండియన్ డ్యాన్స్ టీం.  మరో టీం ఖైదీ నెంబర్ 150 సినిమాలోని సుందరి ఓ సుందరి సాంగ్ కు డ్యాన్స్ చేసింది.  


ఇప్పుడు రింగ రింగ సాంగ్ వంతు వచ్చింది.  ఆర్య 2 సినిమాలో రింగ రింగ సాంగ్ ఉన్నది.  ఈ సాంగ్ అప్పట్లో ఊర్రూతలు ఊగించింది.  సినిమా కావడంతో పాటు సాంగ్ కూడా హిట్ అయ్యింది.  ఇన్నేళ్ల తరువాత ఈ సింగ్ ను ఆస్ట్రేలియాలోని మెల్బ్రోన్ క్లబ్ లో రింగ రింగ డ్యాన్స్ కు స్టెప్పులు వేశారు.  


ఈ వీడియోను కొంతమంది ఔత్సాహితులు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  రింగ రింగ పాటలు ఫారెన్ భామల స్టెప్పులు ఆరహు అన్నట్టు ఉన్నాయి.  సో, మన తెలుగు సినిమానే కాకుండా, మన పాటలు కూడా ప్రపంచ వ్యాప్తం అవుతున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: