రెండు డిఫరెంట్ జానర్ లోని సినిమాల టీజర్ లు ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి.  అందులో ఒకటి సాహో టీజర్ కాగా, రెండోది నాగార్జున మన్మధుడు 2 టీజర్.  ఈ రెండు టీజర్స్ ని ఒకే రోజు ఎందుకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారో తెలియదు.  టీజర్స్ కాబట్టి పెద్దగా పోటీ ఉండదు.  


ఫ్రీగా చూసేది కాబట్టి రెండింటిని చూస్తారు.  కాకపోతే ప్రభాస్ టీజర్ పూర్తి స్థాయిలో యాక్షన్ పద్దతిలో కట్ చేసిన టీజర్. యాక్షన్ కు సంబంధించిన సీన్స్ తోనే టీజర్ ఉండొచ్చు.  యాక్షన్ మరీ ఎక్కువైతే తట్టుకోవడం కష్టమే.  కానీ, ఇండియాలో అదీ తెలుగులో వస్తున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ యాక్షన్ ఫిలిం కావడంతో ఆసక్తి ఉంది.  


ఇక మన్మధుడు 2 విషయానికి వస్తే.. మన్మధుడు 2 సినిమా పూర్తిగా లవ్, ఎంటరైనర్ గా ఉంటుంది.  16 సంవత్సరాల క్రితం వచ్చిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ కావడంతో ఇంచుమించుగా అలాంటి క్వాలిటీ కామెడీతోనే ఉంటుందని అనుకోచ్చు.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఎలా ఉంటుందో కాసేపట్లో తేలిపోతుంది.  


ఇప్పుడు ఈ రెండు టీజర్లు ఢీకొట్ట బోతున్నాయి.  విజయం ఎలాగో ప్రభాస్ వైపే ఉంటుంది.  బట్, మన్మధుడు 2 టీజర్ బాగుంది అని తెలిస్తే దానికి కూడా విశేషమైన ఆదరణ తప్పకుండా లభిస్తుంది అనడంలో సందేహం లేదు.  చూద్దాం ఎలా ఉంటుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: