ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఆరు వారాలకు పైగా గ్యాప్ ఇచ్చిన తరువాత షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారు.  ఎన్టీఆర్ భారీ ఫైట్ సీన్ షూట్ జరుగుతున్నది.  త్వరలోనే రామ్ చరణ్ కూడా జాయిన్ అవుతారు.  


ఇదిలా ఉంటె, ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేయడమే కాకుండా, జపాన్ వంటి దేశాల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు వీలుగా రాజమౌళి ఓ ప్లాన్ వేసినట్టుగా సమాచారం.  ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రభాస్.. అనుష్క జంట ఓ చిన్న పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది.  


పాత్ర చిన్నదే ఉన్నా దానికి తగ్గట్టుగా మార్కెట్ చేసుకోవడానికి అవకాశం దొరికినట్టు అవుతుంది.  అందుకోసమే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.  రాజమౌళి నిర్ణయానికి ప్రభాస్, అనుష్కలు ఒకే చేశారా లేదా అన్నది తెలియాలి.  బాహుబలి వంటి భారీ హిట్ ఇచ్చారు కాబట్టి అయన అడిగితె కాదనరు.  


ఒకవేళ ఉంటె ఎలాంటి పాత్ర ఉంటుంది.  ఎంత టైమ్ ఉంటుంది.  రోల్ ను ఎక్కడ ఎలా చూపించబోతున్నారు అన్నది రాజమౌళికి తెలియాలి.  దాదాపు భారీ తారాగణంతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈ స్థాయిలో సినిమాను తీయడం అంటే మామూలు విషయం కాదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: