కొన్ని కాంబినేషన్లు చాలా కొత్తగా ఉంటాయి.  క్రేజీగా ఉంటాయి.  ఆయా కాంబినేషన్లో సినిమాలు రావాలని కోరుకుంటారు.  అలంటి క్రేజీ కాంబినేషన్లో ఒకటి త్రివిక్రమ్, ప్రభాస్ ఒకటి.  ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు.  త్రివిక్రమ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్.  


అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో సినిమాలు చేశాడు.  వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు దాదాపుగా అన్ని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.  ప్రస్తుతం బన్నీతో సినిమా చేస్తున్నాడు.  


ఈ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని మెగాస్టార్ తో సినిమా చేయాల్సి ఉంది. ఇది పూర్తయ్యాక ఎవరితో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది.  బాహుబలి సినిమాతో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్,సెంటిమెంట్ పరంగా చేసిన సినిమాలు చాలా తక్కువ.  ఎమోషన్ ఉండే సినిమాలు తక్కువే.  


త్రివిక్రమ్ తో సినిమా అంటే ఈ రెండు తప్పకుండా ఉంటాయి.  సెంటిమెంట్ ఎమోషన్ ను ఒక హీరో నుంచి రాబట్టుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట.  అందుకే త్రివిక్రమ్ తో సినిమా చేస్తే ఆ హీరో పర్ఫెక్ట్ అవుతారనే నానుడి ఉంది.  ఇందుకు తగ్గట్టుగానే అది రుజువయ్యింది కూడా.  


చాలా కాలం క్రితమే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందనే ప్రచారం జరిగింది.  ఈ ప్రచారానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో హల్చల్ కూడా చేసింది.  కానీ, ఎందుకో తెలియదు ఇప్పటి వరకు సెట్ కాలేదు.  ఈసారైనా అది సెట్ అవుతుందేమో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: