యాంగ్రి యంగ్ మ్యాన్ గా 90 దశకంలో తెలుగు సినీ సీమను ఏలిన రాజశేఖర్ ఇపుడు బాగా తగ్గారు. అరకొరగా మూవీస్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటున్నారు. రాజశేఖర్ జీవిత ఇద్దరూ సినీ జంట. వారి వారసులు సహజంగా మూవీస్ లోకి వచ్చేస్తారు. 


ఈ రూల్ తప్పకుండా ఇద్దరు కూతుళ్ళను సినీ రంగ ప్రవేశం చేయించేశారు జీవితా రాజశేఖర్. పెద్దమ్మాయి శివాని డెబ్యూ మూవీ సగం అయ్యాక చిక్కులో పడింది. దాంతో ఎపుడు వస్తుందో తెలియదు, ఇక చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. జూలై 5న రిలీజ్ అవుతోంది. ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా దీన్ని తీశారు. టీజర్ చూస్తే విషయం ఉన్నట్లు అర్ధమవుతోంది.  ఈ మూవీలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేశాడు.


ఇక ఈ మూవీలో శివాత్మిక బాగానే అభినయం చేసిందని అంటున్నారు. దాంతో మరో కొత్త హీరోతో ఆమెకు చాన్స్ వచ్చింది. దివంగత హీరో శ్రీహరి పెద్ద కొడుకు మేఘాంశ్ హీరోగా తీస్తున్న మూవీ లో శివాత్మిక హీరోయిన్ గా సెలెక్ట్  అయింది. అంటే ఈ దొరసాని మంచి  జోరు మీద ఉన్నట్లే. ఇక ఫస్ట్ మూవీ హిట్ అయింతే  ఈ అమ్మడు పరుగులు పెడుతుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: