మెగాస్టార్ హీరోగా చేస్తున్న సైరా సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 2 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.  

ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  ఆగష్టు 22 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. మెగాస్టార్ బర్త్ డే రోజున టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.  టీజర్ ఎలా ఉంటుంది అనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.  

ప్రస్తుతం పాండిచ్చేరి లోని బ్రిటిష్ పాత భవనాల్లో షూటింగ్ చేస్తున్నారు.  బ్రిటిష్ దొరలకు, సైరాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నది.  ఈ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలవబోతున్నాయి.  అయితే, ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ చేస్తున్నారు.  

సినిమాకు గ్రాఫిక్స్ వర్క్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు షూటింగ్ జరిగింది ఆరోజే ఎడిట్ చేసి గ్రాఫిక్స్ చేస్తున్నారట. దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం విశేషం.  సినిమా ఎలా ఉంటుందో మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: