టాలీవుడ్ ప్రేక్షకులకు 6 పాటలు, 5 ఫైట్లు.. లవ్ కామెడీ సెంటిమెంట్ ఇవి ఉంటె చాలు సినిమా నచ్చుతుంది.  ఇవి కూడా సమపాళ్లలో ఉండాలి.  అప్పుడే సినిమా చూస్తారు. లేదంటే మాత్రం పక్కన పడేస్తారు.  సాంగ్స్ ఆకట్టుకునే విధంగా ఉండాలి.  ఫైట్స్ కొత్తగా ఉండాలి.  మరో ఓవర్ గా కూడదు.  

కామెడీకి హద్దు ఉండకూడదు.  ప్రేమ ఉండాలి కానీ, ఎక్కువుగా ఉండకూడదు.  గ్లామర్ ఏ మేరకున్నా ఒకే.  అంతేకాదు, తెలుగు హీరో కొండను ఎత్తి అవతల పారెయ్యడం..ఇక్కడ విలన్ కు కొడితే వెళ్లి ఎక్కడో ఉన్న పోల్ కు గుద్దుకొని పోల్ కిందపడిపోవడం వంటి వాటిని మన ప్రేక్షకులు పెద్దగా లైక్ చేయరు.  

ఇవేం ఫైట్స్ రా బాబు.. మరి అతి ఎక్కువైంది అని పక్కన పడేస్తారు.  హాలీవుడ్ మూవీస్ లో యాక్షన్ బాగుటుంది.  వాటిని మనవాళ్ళు చూస్తారు.  అలా చూడటానికి కారణం ఉంది.  హాలీవుడ్ లో యాక్షన్ పార్ట్ రియల్ గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది.  అలాగని కొండలు ఎత్తటం వంటివి ఉండవు.  

ఇప్పుడు టాలీవుడ్ లో సాహో సినిమా ఇలాంటి యాక్షన్ సన్నివేశాలతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  యాక్షన్ భారీగా ఉండబోతున్నట్టు రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ ను చూస్తుంటే అర్ధం అవుతుంది.  యాక్షన్ బాగున్నా పర్వాలేదు.  అవి మనం నమ్మగలిగే విధంగా ఉంటె చాలు.  ప్రేక్షకులు ఆదరిస్తారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: