ముందుగా భారతీయ విద్యా వ్యవస్థలో త్రిభాషా సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. అయితే దక్షిణాది రాష్ట్రాలు ఒక్కసారిగా ఈ విషయంపై భగ్గుమన్నాయి. అందుకని కేంద్రం వెనక్కి తగ్గింది  ఆది నుండి దక్షిణాది రాష్ట్రాలు హిందీని తమ మీద బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తున్నాయి.  

కానీ వివరాల ప్రకారం దక్షిణాదిన హిందీకి ఆదరణ పెరుగుతుందని అర్థమవుతుంది. ఉత్తరాది నుండి వలస వచ్చే వారు,ఇంకా బాలీవుడ్ సినిమాల వల్ల ఆదరణ పెరుతుంది. కానీ ఇవేవీ ప్రాంతీయ భాషల మీద ఎటువంటి ప్రభావం చూపట్లేదు.

హిందీని ఇండియా మొత్తం వ్యాప్తి చేయడానికి సినిమాల పాత్ర ఎంతో ఉందని భాషావేత్త అయిన ఎస్. ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు. గూగుల్ సెర్చ్  ప్రకారం హిందీ సినిమాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. దీన్ని బట్టి హింది సినిమాలకి దక్షిణాదిన ఎంత ఆదరణ ఉందో తెలుసుకోవచ్చు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి వేరేగా ఉంది. ఇక్కడ హిందీ సినిమాల కంటే ప్రాంతీయ సినిమాల గురించి సెర్చ్ చేసిన వారే ఎక్కువ. ఒక్క కేరళలో మాత్రం ప్రాంతీయ సినిమాల కంటే హిందీ సినిమాల కోసమే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: