"ఎన్టీఆర్" బయోపిక్ తర్వాత బాలయ్య చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కె. ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ స్క్రిప్టు పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ముందుకు సాగట్లేదు.

బాలయ్యతో సినిమా చేయాలని బోయపాటి వెయిట్ చేస్తున్నాడు. కె .యస్ రవికుమార్ సినిమా ఆలస్యం అవుతుండడంతో  బోయపాటి సినిమాని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడట. ఇప్పటివరకు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరనేది ఇంతవరకు తెలిసి రాలేదు.

అయితే అనూహ్యంగా దిల్ రాజు పేరు తెరమీదకొచ్చింది. ఇప్పటి వరకు దిల్ రాజు , బాలయ్య కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇదే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా అవుతుంది.

బోయపాటి "భద్ర" తర్వాత ఇంతవరకు దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయలేదు.  భద్ర సినిమా వచ్చి ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది.ఒకవేళ ఈ వార్త నిజమైతే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ వార్తపై అధికార సమాచారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: