తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయి.  గతంలో బాలీవుడ్ కే పరిమితమైన కొత్త కాన్సెప్ట్ లు తెలుగు బుల్లితెరపై కూడా కనిపిస్తున్నాయి.  కామెడీ అంటే ఏదో చిన్న సిరియల్స్, స్పెషల్ ప్రోగ్రామ్ అంటూ సాగే మూసపద్దతికి జగర్ధస్త్, పటాస్, జూ లకలక లాంటి కామెడీ ప్రోగ్రామ్స్ కొత్తదనం తీసుకు వచ్చాయి. వీటి తో పాటు అన్ని వర్గాల ప్రజలను అలరించిన ‘బిగ్ బాస్ ’కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తుంది.


తెలుగు బుల్లితెరపై ఇప్పటికే రెండు బిగ్ బాస్ సీజన్లు పూర్తి అయ్యాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 1 కి జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వచ్చారు.  బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వచ్చారు.  అయితే బిగ్ బాస్ సీజన్ 1 కి వచ్చినంత ఆదరణ సీజన్ 2 కి రాలేదు. ఇందులో పాల్గొన్న ఇంటి సభ్యుల మద్య వచ్చిన గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి..అలాగే నాని కొన్ని ఎపిసోడ్స్ లొ ఆకట్టుకోలేక పోయాడు.  దాంతో బిగ్ బాస్ సీజన్ 2 లో జరిగిన పొరపాటు జరగవొద్దని యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు సమాచారం. 


ఇందుకోసం సినీ, టీవి పాపులర్ సెలబ్రెటీలను రంగంలోకి దింపాలని చూస్తున్నారట.  ఈ నేపథ్యంలో కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ ని బిగ్ బాస్ లోకి తీసుకోవాలని యాజమాన్యం కొన్ని రోజులుగా సంప్రదింపులు జరుపుతుందట. మొదట షోలో పాల్గొంటాను అని ఉత్సాహం చూపినప్పటికీ లిస్ట్ ఫైనల్ చేస్తున్న స్టేజ్ లో నో చెప్పేశాడట. అందుకు బలమైన కారణం చెప్పడంతో షో నిర్వాహకులు బండ్ల గణేష్ నిర్ణయానికి ఎదురుచెప్పలేదు.  


ప్రస్తుతం బండ్ల గణేష్ తెలంగాణలో భారీ స్థాయిలో పౌల్ట్రీ బిజినెస్ చేస్తున్నారు.  అయితే బిగ్ బాస్ లోకి వెళితే బయట ప్రపంచంలో సంబంధాలు ఉండవని..అలాంటపుడు తన బిజినెస్ ఇబ్బందులో పడుతుందని..తన జీవనం పౌల్ట్రీ బిజినెస్ అని అది వొదులుకోని తాను రాలేనని బిగ్ బాస్ యాజమాన్యానికి సున్నితంగా చెప్పి పక్కకు తొలగారట బండ్ల. 

మరింత సమాచారం తెలుసుకోండి: