యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ టీజ‌ర్ గురువారం రిలీజ్ అయ్యింది. చిత్ర‌యూనిట్ ముందుగా చెప్పిన‌ట్టుగానే 11.23 నిమిషాల‌కు టీజ‌ర్ రిలీజ్ చేశారు. టీజ‌ర్ రిలీజ్ అయ్యిందో లేదో ?  రికార్డులు బ్రేక్ అవ్వ‌డం స్టార్ట్ అయ్యింది. 1.39 నిమిషాల పాటు ఉన్న టీజ‌ర్‌తోనే సినిమాలో లెక్క‌లేన‌న్ని యాక్ష‌న్ ప్రేముల‌ను పెట్టేశారు. టీజ‌ర్ అంతా క్రిస్పీగా ఉంది. సినిమాలో న‌టిస్తోన్న ప్ర‌భాస్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న శ్రద్ధాకపూర్‌, మెయిన్ విలన్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌లతో పాటు అరుణ్ విజయ్‌, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్‌, మహేష్ మంజ్రేకర్‌, మందిరా బేడి, ఎవ్లిన్‌ శర్మ, వెన్నెల కిశోర్‌లను ప‌రిచ‌యం చేసేశాడు.


కథా, కథనాలపై కూడా హింట్‌ ఇచ్చి సినిమా మీద అంచనాలను పెంచేశారు. ప్రభాస్‌పై తెరకెక్కించిన కార్‌, బైక్‌ చేజ్‌లతో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో టేస్ట్ చూపించారు. దుబాయ్‌, అబూదాబీ, విదేశాల్లో తీసిన యాక్ష‌న్ షాట్స్ చూసేందుకు రెండు క‌ళ్లు స‌రిపోతాయా ? అన్న‌ట్టుగా టీజ‌ర్ క‌ట్ చేశారు. టీజ‌ర్‌లో 
హెలికాప్టర్లు, భారీ ట్రక్కులు, కార్‌, బైక్ చేజింగులు, వంద‌ల అంత‌స్తుల బిల్డింగుల‌పై ఫైట్లు, ఇసుక తుపానులు, భ‌యంక‌రంగా ఉన్న విల‌న్ గ్యాంగ్లు, కార్లు గ‌ద్దుకోవ‌డాలు చూస్తుంటే హాలీవుడ్ సాహో అనేలా ఉంది.


ఇక సాహో టీజ‌ర్ రిలీజ్‌తోనే యూట్యూబ్‌లో రికార్డులు బ్రేక్ చేసుకుంటూ ముందుకు పోతోంది. తొలి 10 నిమిషాల‌కే 1.50 ల‌క్ష‌ల వ్యూస్‌ను దాటేసింది. ఇక ఇర‌వై నిమిషాల‌కు 2 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌తో పాటు 1.5 ల‌క్ష‌ల లైక్స్‌తో పాటు 7.6 డిస్‌లైక్స్ సొంతం చేసుకుంది. ఏదేమైనా సాహో టీజ‌ర్ రికార్డులకు కొద్ది రోజుల వ‌ర‌కు బ్రేక్ ప‌డేలా లేదు. ఇక టీజ‌ర్‌తోనే రికార్డులు దుమ్ము రేపుతోన్న సాహో రిలీజ్ అయ్యాక మ‌రిన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేయ‌డం ప‌క్కాయే.


మరింత సమాచారం తెలుసుకోండి: