ఎప్పుడెప్పుడా అని అందరూ వేయి కళ్ళతో ఎదురుచూపులు చూస్తున్న టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో టీజర్ కాసేపటి క్రితం విడుదలై యూట్యూబ్ లో సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. ఇక టీజర్ మొత్తం మంచి యాక్షన్ మరియు ఛేజింగ్ సీన్స్ తో ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. 

అయితే టీజర్ లో కొన్ని సీన్స్ గ్రాఫిక్ వర్క్ మాత్రం కాస్త కృతకంగా ఉందని విమర్శలు వస్తున్నప్పటికీ రేపు థియేటర్లో సినిమా చూసేటప్పుడు అటువంటి ఫీలింగ్ ఉండదని అంటున్నారు సినీ విశ్లేషకులు. అనుకున్న విధంగా టీజర్ విడుదలై అటు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఇటు టాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పిస్తున్నప్పటికీ ఒక్క ప్రశ్నకు మాత్రం ఎవ్వరికీ సమాధానం దొరకటం లేదు. అదేమిటంటే, టీజర్ చివరిలో సాహో సినిమాకు పనిచేసిన టెక్నీకల్ టీమ్ ఎవరెవరు ఉన్నారో, వారి వివరాలు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అయితే ఒక్క సంగీత దర్శకుడి పేరు మాత్రం అందులో పొందుపరచలేదు, అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని గిబ్రాన్ అందించినట్లు అందులో పేర్కొనడం జరిగింది. 

ఇటీవల ఈ చిత్రానికి పని చేసిన బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్.ఎహసాన్.లాయ్ లు అర్ధంతరంగా చిత్రం నుండి తప్పుకోవడంతో అసలు ఈ సినిమాలో పాటలు ఉన్నాయా, ఉంటె వాటిని ఎవరు కంపోజ్ చేసారు, సంగీత దర్శకుడు ఎవరు వంటి విషయాలపై మాత్రం సందిగ్ధత నెలకొంది. అయితే మరికొద్దిరోజుల్లోనే సాహోలోని ఒక్కొక్క పాటను చిత్ర బృదం విడుదల చేయడం జరుగుతుందని, ఆ సమయంలో చిత్రానికి సంగీతం ఎవరు అందించారు అనే దానిపై క్లారిటీ వస్తుందని కొందరు టాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. మరి ఈ ప్రశ్నకు సమాధానంగా సాహో టీమ్ పాటలు ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో ఆగవలసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: