అభిమానులు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్న సాహో టీజర్ రానే వచ్చింది. ఈ టీజర్ అందరి అంచనాలకు మించి ఉందని చెప్పాలి. ప్రేక్షకులు ఆశించిన భారీ ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ సీన్స్ అన్నీ ఉన్నాయి. కానీ వీటితో పాటు ఆడియన్స్ ఊహించని మరో ఎలిమెంట్ కూడా సాహో టీజర్ లో ఉంది. అదే బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అవును.. టీజర్ లో అందర్నీ ఆకట్టుకున్న ఎలిమెంట్ ఇది. విజువల్స్ తో బీజీఎం పోటీపడింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటూ విజువల్స్ చూస్తుంటే ఆ కిక్కే వేరు. కానీ అంతా ఊహిస్తున్నట్టు ఈ టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ అందించింది తమన్ కాదు.


షేడ్స్ ఆఫ్ సాహో పేరిట ఇంతకుముందు విడుదలైన 2 మేకింగ్ వీడియోస్ కు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. పైగా సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. టీజర్ కు మ్యూజిక్ అందించే అవకాశం కూడా తమన్ కే దక్కి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ టీజర్ కు జిబ్రాన్ సంగీతం అందించాడు. అతడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


ముందే చెప్పుకున్నట్టు టీజర్ లో అబుదాబిలో తీసిన యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు శ్రద్ధాకపూర్ తోనే టీజర్ స్టార్ట్ అవ్వడం విశేషం. ఒక నిమిషం 38 సెకెన్ల నిడివి కలిగిన ఈ టీజర్ లో హీరోహీరోయిన్లతో పాటు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, అరుణ్ విజయ్ లాంటి నటుల్ని కూడా చూపించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్టు మరోసారి ప్రకటించారు. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది సాహో. 

మరింత సమాచారం తెలుసుకోండి: